IMD Cold Wave Alert : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏఏ జిల్లాల్లో ప్రమాదకర స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయంటే..
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చలి చంపేస్తోంది... అత్యల్ప స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరికొన్నిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని... కొన్నిచోట్ల చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది. రాబోయే ఐదురోజులు తెలంగాణలో చలి ఎలా ఉండనుంది? ఉష్ణోగ్రతలు ఏ స్థాయికి పడిపోతాయి? అనేది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
26
ఇక్కడ సింగిల్ డిజిట్ టెంపరేచర్స్
తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువగా నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలున్నాయి... కాబట్టి ప్రజలు ఈ ఐదురోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
36
తెలంగాణలో గడ్డకట్టే చలి
డిసెంబర్ 9 నుండి డిసెంబర్ 13 వరకు అంటే మంగళవారం నుండి శనివారం వరకు చలిగాలులు కొనసాగనున్నాయని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఈ ఐదురోజులూ 5 నుండి 10 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయట. అత్యంత చలి వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలుంటాయి... కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
ఇదిలావుంటే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఈ రెండ్రోజులు (డిసెంబర్ 9,10) రెండ్రోజులు మాత్రమే 5 నుండి 10 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఆ తర్వాత చలితీవ్రత కాస్త తగ్గుతుందని... 11 నుండి 15 డిగ్రీ సెల్సియస్ కి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ప్రకటించింది. ఇదే సమయంలో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో డిసెంబర్ 11 నుండి చలితీవ్రత పెరుగుతుందని... ఉష్ణోగ్రతలు 5 నుండి 10 డిగ్రీ సెల్సియస్ నమోదవుతాయని ప్రకటిచింది. ఈ రెండు జిల్లాల్లో ఇవాళ, రేపు (మంగళ, బుధవారం) ఉష్ణోగ్రతలు 11 నుండి 15 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలుంటాయని తెలిపింది.
56
తెలంగాణలో ఈ వారమంతా చలే
తెలంగాణలోని మిగతా జిల్లాల్లో ఈ ఐదురోజులు 11 నుండి 15 డిగ్రీ సెల్సియిస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తంగా ఈ వారమంతా చలి వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆందోళనకర విషయం ఏంటంటే ఉష్ణోగ్రతలు 1 నుండి 2 డిగ్రీ సెల్సియస్ కు పడిపోయే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ లాంటి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
66
హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు
ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున అత్యల్పంగా ఆదిలాబాద్ లో 7.7, మెదక్ 8.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హన్మకొండ 11.5, రామగుండం 11.6, నిజామాబాద్ 12.1 టెంపరేచర్స్ ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ విషయానికి వస్తే పటాన్ చెరు ఈక్రిశాట్ వద్ద అత్యల్పంగా 8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాజేంద్రనగర్ 10, హయత్ నగర్ 11.6, బేగంపేట 13 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.