ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజులు తెలంగాణవ్యాప్తంగా గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు మెరుపులతో వానలు పడనున్నాయి. ముఖ్యంగా కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అలర్ట్ ఇచ్చారు.