IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్లకల్లోలం... ఈ ప్రాంతాల్లో ఏకంగా 30మిమీ వర్షపాతం తప్పదా..?

Published : Feb 17, 2026, 12:47 PM ISTUpdated : Feb 17, 2026, 01:24 PM IST

Rain Alert : వేసవికాలం ఆరంభంలోనే వర్ష బీభత్సం తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల ప్రభావంతో ఫిబ్రవరి సెకండాఫ్ మొత్తం వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

PREV
15
వేసవిలో వర్షాలు..

IMD Rain Alert : చలికాలం ముగిసింది... వేసవి కాలం ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది... దక్షిణాది రాష్ట్రాల్లో ఇక వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫిబ్రవరి చివరివరకు వర్షాలుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

25
బంగాళాఖాతంలో అల్పపీడనం...

ప్రస్తుతం బంగాళాఖాతంలో వర్షాలకు అనుకూల వాతావరణం కొనసాగుతోంది... ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ముందుకు సాగుతూ ఫిబ్రవరి 19 (వచ్చే గురువారం) నాటికి మరింత బలపడనుందని అంచనా వేస్తున్నారు. ఇలా నైరుతి బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, శ్రీలంకలో వర్షాలకు కారణం అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

35
తెలంగాణలో వర్షాలు...

తెలంగాణలో ఫిబ్రవరి 22 నుండి వర్షాలు మొదలవుతాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. మొదటిరోజు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ములుగు, జగిత్యాల, మంచిర్యాలలో వానలు పడతాయట. భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.

ఇక ఫిబ్రవరి 23, 24 తేదీల్లో (సోమ, మంగళవారం) వర్షాలు మరింతగా విస్తరించే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు. ఈస్ట్, సౌత్, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. పల్లెలు, పట్టణాలని తేడాలేకుండా అంతటా వర్షాలుంటాయని... హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, భద్రాచలం పట్టణాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. కొన్నిచోట్ల వడగళ్ల వానలు పడే అవకాశాలు ఉన్నాయట.

వచ్చే ఆది, సోమ, మంగళవారం తెలంగాణలోని కొన్నిచోట్ల 20-30mm వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. కాబట్టి వర్షాలవల్ల పంటలు నాశనం కాకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈ ఈదురుగాలులతో కూడిన వర్షాలు మామిడి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చే అవకాశాలుంటాయి.

45
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై కూడా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది. ఈ వర్షాల సమయంలో పిడుగుల ప్రమాదం పొంచివుంటుంది... కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి.

అల్పపీడనం నేపథ్యంలో సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచిస్తోంది. తీరప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది... కాబట్టి ఆ ప్రాంతాల్లో నివాసముండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

55
తెలంగాణలో మండుటెండలు..

వేసవి ఆరంభంలోనే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి... ప్రస్తుతం ఏకంగా 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా మహబూబ్ నగర్ లో 34.7, భద్రాచలంలో 34.4, ఆదిలాబాద్ లో 34.3, ఖమ్మంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఎండలు పెరిగాయి... దీంతో నగరవాసులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. హకీంపేటలో అత్యధికంగా 33.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. 

Read more Photos on
click me!

Recommended Stories