ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టిన.. కౌన్సిల‌ర్ల‌కు, ఛైర్‌ప‌ర్స‌న్‌కు వ‌చ్చే జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Published : Feb 17, 2026, 10:15 AM IST

Telangana: తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసిన విష‌యం తెలిసిందే. 7 కార్పొరేష‌న్ల‌కు, 105 మున్సిపాలిటీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో ఎంపికైన మేయ‌ర్లు, ఛైర్మ‌న్లు ఏ ప‌ని చేస్తారు.? వారికి జీతం ఎంత వస్తుందో తెలుసుకుందాం.  

PREV
16
ప్ర‌థ‌మ పౌరుడు

కార్పొరేష‌న్ల‌లో మేయర్‌, మున్సిపాలిటీలో ఛైర్‌పర్సన్ స్థానిక సంస్థకు ప్రథమ పౌరుడు. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ వంటి ప్రముఖుల పర్యటనల సమయంలో అధికారిక కార్యక్రమాల్లో వీరికి ముందస్తు స్థానముంటుంది. పట్టణాన్ని ప్రతినిధ్యం వహించే బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది. డిప్యూటీ మేయర్, వైస్‌ఛైర్మన్‌లు సహాయక పాత్ర పోషిస్తారు. ముఖ్యుడు గైర్హాజరైతే సమావేశాలకు అధ్యక్షత వహించే అధికారం వారికి ఉంటుంది.

26
మేయర్‌, డిప్యూటీ మేయర్ వేతనాలు

నగరపాలక సంస్థల్లో మేయర్‌కు నెలకు రూ.65,000 వేతనం అందుతుంది. డిప్యూటీ మేయర్‌కు రూ.32,500 చెల్లిస్తారు. కార్పొరేటర్‌కు రూ.7,800 నెలసరి భత్యంగా లభిస్తుంది. మేయర్‌కు వాహన సౌకర్యం, వాహన భత్యం లభిస్తాయి. అవసరమైన కార్యాలయ సిబ్బంది సహాయం కూడా పొందవచ్చు.

ఇక మున్సిపాలిటీల విష‌యానికొస్తే.. మున్సిపాలిటీల్లో జనాభా ఆధారంగా వేతనాలు నిర్ణయిస్తారు. 50 వేలకుపైగా జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్‌కు రూ.19,500, డిప్యూటీ ఛైర్‌పర్సన్‌కు రూ.9,750 వేత‌నం చెల్లిస్తారు. అదే

కౌన్సిలర్‌కు రూ.4,550 అందిస్తారు. ఇక 50 వేలలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్‌కు రూ.15,600, డిప్యూటీ ఛైర్‌పర్సన్‌కు రూ.6,500, కౌన్సిలర్‌కు రూ.3,250 జీతం చెల్లిస్తారు.

36
పదవీకాలం

కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నికైన తేదీ నుంచి ఐదేళ్లపాటు పదవిలో ఉంటారు. పాలకవర్గ సమావేశాల్లో చర్చించేందుకు కో-ఆప్టెడ్ సభ్యులు కూడా ఉంటారు. నగరపాలక సంస్థల్లో ఐదుగురు, మున్సిపాలిటీల్లో నలుగురు చొప్పున వీరిని నియమిస్తారు. వీరికి చర్చించే హక్కు ఉన్నా, ఓటు హక్కు ఉండదు.

46
అవిశ్వాస తీర్మానం ఎలా?

మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఛైర్‌పర్సన్‌, వైస్‌ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి నాలుగేళ్లలో అవిశ్వాస తీర్మానం పెట్టలేరు. నాలుగేళ్ల తర్వాత మొత్తం ఓటు హక్కు కలిగిన సభ్యులలో కనీసం సగం మంది సంతకాలతో నోటీసు ఇవ్వాలి. ఆపై సమావేశంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదమైతే పదవి కోల్పోవాల్సి వస్తుంది.

56
పాలకవర్గ ప్రధాన బాధ్యతలు

పట్టణ అభివృద్ధి పూర్తిగా ఈ స్థానిక సంస్థల చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యమైన బాధ్యతలు ఇలా ఉంటాయి:

పారిశుద్ధ్య పర్యవేక్షణ:

* రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం

* వీధిదీపాల నిర్వహణ

* తాగునీటి సరఫరా

* మొక్కల నాటడం, సంరక్షణ

* ప్రజల ఫిర్యాదుల పరిష్కారం

* పన్నుల వసూలు

* రుణాల చెల్లింపులు

* మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం ఉంటే సంబంధిత వార్డు సభ్యుడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

66
సమావేశాల నిర్వహణ

పాలకవర్గం నెలకు కనీసం ఒకసారి సమావేశం నిర్వహించాలి. నగరపాలక సంస్థలో మేయర్‌, మున్సిపాలిటీలో ఛైర్‌పర్సన్ అధ్యక్షత వహిస్తారు. ప్రధానుడు గైర్హాజరైతే డిప్యూటీ మేయర్‌ లేదా వైస్‌ఛైర్మన్ సమావేశాన్ని నడిపిస్తారు. ఈ సమావేశాల్లో అభివృద్ధి పనులు, బడ్జెట్‌, పథకాల అమలు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారు.

ప్రభుత్వ నిధులు, పథకాలు

కేంద్రం, రాష్ట్రం నుంచి పథకాల రూపంలో గ్రాంట్లు వస్తాయి. ఆ నిధులను సక్రమంగా వినియోగించడం పాలకవర్గ బాధ్యత. పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల పెంపు, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు ఈ నిధులతో అమలు చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories