IMD Weather Update : ఈ రెండ్రోజులు తెలంగాణలో అత్యంత చలి ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఏ స్థాయికి పడిపోయే అవకాశాలున్నాయంట తెలుసా?
Cold Waves : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే గజగజలాడించే చలి ఉంది... ఉష్ణోగ్రతలు కుప్పకూలిపోయి సింగిల్ డిజిట్ కు చేరుకున్నాయి. ఈ చలికే ప్రజలు వణికిపోతుంటే ఈ రెండ్రోజులు (డిసెంబర్ 19, 20) ఈ సీజన్ లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లోనే కాదు రాజధాని నగరం హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత పెరుగుతుందని ప్రకటించారు.
26
ఈ రాత్రి పీక్స్ చలి
ఇవాళ (శుక్రవారం) రాత్రి చలి ఫీక్స్ కు చెరుకుంటుందని... ఆదివారం ఉదయం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. అంటే శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజాము... తిరిగి శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున (రెండు రాత్రులు, రెండు ఉదయాలు) ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి గడ్డకట్టే చలి ఉంటుందని ప్రకటించారు.
36
ఉత్తర తెలంగాణలో లోయెస్ట్ టెంపరేచర్స్
ఉత్తర తెలంగాణలో ఈ రెండ్రోజులు 5-7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఇంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇక పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా ఇలాగే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయట. హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని.. అత్యల్ప స్థాయికి (7-10°C) చేరుకుని చలి ఇరగదీస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 5.7 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహీర్ లో 6.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 6.5, ఆదిలాబాద్ లో 7.7, వికారాబాద్ లో 8.1, సిద్దిపేటలో 8.1, మెదక్ లో 8.5, కామారెడ్డిలో 8.6, నిర్మల్ లో 8.9, నిజామాబాద్ లో 9.1, నాగర్ కర్నూల్ లో 9.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు.
56
హైదరాబాద్ పై చలి పంజా
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ లో 6.5°C, ఇబ్రహీంపట్నంలో 7.5°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. నగరంలోని శేరిలింగంపల్లి (HCU) లో 8.1, మౌలాలిలో 9.4, రాజేంద్రనగర్ లో 9.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇంకా నగరంలోని అనేక ప్రాంతాల్లో 10 నుండి 15 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాంక్రీట్ జంగిల్ హైదరాబాద్ లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఆశ్చర్చకరం.
66
ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఎక్కడో తెలుసా?
ఆంధ్ర ప్రదేశ్ లో చలి తెలంగాణ కంటే దారుణంగా ఉంది... ఇక్కడ ఏకంగా 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అరకులో 3, మినుమలూరులో 5, పాడేరులో 7, చింతపల్లిలో 7.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో చలిగాలులు వీస్తున్నాయి.