Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.

Published : Dec 19, 2025, 11:16 AM IST

Hyderabad: హైద‌రాబాద్‌లో సొంతింటి క‌ల నిజం చేసుకోవాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ కోరుకుంటారు. అయితే పెరిగిన ధ‌ర‌ల‌కు భ‌య‌ప‌డి ఆ ఆలోచ‌న మానుకుంటారు. కానీ త‌క్కువ ఆధాయం ఉన్న వారి కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు మంచి అవ‌కాశాన్ని క‌ల్పించింది. 

PREV
15
ఎల్‌ఐజీ వర్గాలకు హౌసింగ్ బోర్డు శుభవార్త

సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనుకునే త‌క్కువ ఆదాయ వర్గాలకు తెలంగాణ హౌసింగ్ బోర్డు మంచి అవకాశం కల్పించింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నగరాల్లో సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లను అందుబాటు ధరల్లో విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. మొత్తం 339 ఫ్లాట్లు ఈ స్కీమ్‌లో భాగంగా అందుబాటులోకి రానున్నాయి.

25
అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్న ఫ్లాట్లు

ఈ ఫ్లాట్లు ఇప్పటికే నిర్మాణం పూర్తై, మౌలిక వసతులు కలిగిన అపార్ట్‌మెంట్లలో ఉన్నాయి. గతంలో ప్రైవేట్ సంస్థలతో కలిసి హౌసింగ్ బోర్డు చేపట్టిన జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వాటాగా వచ్చిన ఫ్లాట్లను ఇప్పుడు విక్రయిస్తున్నారు. అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, ఓపెన్ మార్కెట్ ధరలతో పోలిస్తే తక్కువ ధరలకు వీటిని కేటాయిస్తున్నారు.

35
నగరాల వారీగా ఫ్లాట్ల సంఖ్య

హైదరాబాద్ గచ్చిబౌలిలో 111 ఫ్లాట్లు, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో 102 ఫ్లాట్లు, ఖమ్మం శ్రీరామ్ హిల్స్ ప్రాంతంలో 126 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లాట్ల విస్తీర్ణం 450 చదరపు అడుగుల నుంచి 650 చదరపు అడుగుల వరకు ఉంటుంది. అన్నీ సింగిల్ బెడ్‌రూమ్ యూనిట్లే.

45
ధరలు, అర్హతలు ఇలా

గచ్చిబౌలిలో ఫ్లాట్ల ధరలు రూ.26 లక్షల నుంచి రూ.36.20 లక్షల వరకు నిర్ణయించారు. వరంగల్‌లో రూ.19 లక్షల నుంచి రూ.21.50 లక్షల వరకు ధర ఉంది. ఖమ్మంలో ఫ్లాట్ ధర కేవలం రూ.11.25 లక్షలుగా ఉంది. ఏడాదికి రూ.6 లక్షల ఆదాయం (నెలకు రూ.50 వేల లోపు) ఉన్న కుటుంబాలకే ఈ ఫ్లాట్ల కేటాయింపు ఉంటుంది.

55
దరఖాస్తు విధానం, లాటరీ తేదీలు

ఈ ఫ్లాట్ల కోసం ఆన్‌లైన్ విధానంలో లేదా మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే సమయంలో రూ. లక్ష‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా రిఫండబుల్. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 3. గచ్చిబౌలిలోని ఫ్లాట్లకు జనవరి 6న, వరంగల్‌లో జనవరి 8న, ఖమ్మంలో జనవరి 10న లాటరీ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories