ఏప్రిల్ 8న సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, జయశంకర్ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో వానలు పడతాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీస్తాయని పేర్కొంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ కు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో కొనసాగుతోంది. దీని కారణంగా ఆంధ్ర ప్రదేశ్ మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. సోమ, మంగళ వారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడనున్నాయి. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.