Weather Update : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో చలి తగ్గింది. కానీ ఇరు రాష్ట్రాల ప్రజలకు మరికొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని… చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గింది... ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. ఇరు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ నెలంతా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి... కొన్నిచోట్ల ఏకంగా 3-5 డిగ్రీల లోయెస్ట్ టెంపరేచర్స్ కూడా నమోదైన విషయం తెలిసిందే. కానీ కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవగానే చలి తగ్గింది… ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాబోయే నాలుగైదురోజులు (జనవరి ఫస్ట్ వీక్ మొత్తం) ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇలా చలి తగ్గిందని ఊరట చెందుతుంటే వాతావరణ నిపుణులు మరికొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
25
మరింత పెరగనున్న పొగమంచు
తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గినా పొగమంచు తగ్గడంలేదు... ఈ రెండుమూడు రోజులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ముఖ్యంగా ఈస్ట్, సౌత్, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో పొగమంచు తారాస్థాయికి చేరుతుందని... జీరో విజిబిలిటి పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. లో టెంపరేచర్స్ సమయంలో గాలిలో తేమ పెరగడంతో పొగమంచు ఎక్కువయ్యిందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
35
తెలంగాణలో దట్టమైన పొంగమంచు
విపరీతమైన పొగమంచు కురుస్తున్న నేపథ్యంతో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ మ్యాన్ సూచించారు. అత్యవసరం అయితేనే రాత్రుళ్లు, తెల్లవారుజామున ప్రయాణాలు పెట్టుకోవాలని... నిత్య రోడ్లపై ఉండే ప్రజారవాణ, సరుకు రవాణా వాహనాల డ్రైవర్లు మరింత జాగ్రత్తలు పాటించాలని వెదర్ మ్యాన్ సూచిస్తున్నారు. హైదరాబాద్ శివారుప్రాంతాల్లో కూడా దట్టమైన పొగమంచు కురుస్తుంది... కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డు, ఇతర హైవేలపై ప్రయాణించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
చాలా రోజులుగా కొన్ని తెలంగాణ జిల్లాల్లో 10 డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి... కానీ ప్రస్తుతం ఆ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి వంటి లోయెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యే జిల్లాల్లోనూ చలి తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకంటే ఎక్కువగా ఉన్నాయి. .. ఈ రెండుమూడు రోజులు (జనవరి 3 వరకు) ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. డిసెంబర్ 31 రాత్రి నుండి జనవరి 1 ఉదయం వరకు కూడా ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయని... ఆదిలాబాద్ లో అత్యల్పంగా 11.7 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. హైదరాబాద్ లో కూడా 13 డిగ్రీల కంటే ఎక్కువగానే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
55
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే చలి తగ్గిందో లేదో వర్షాలు మొదలయ్యాయి. ఈ రెండుమూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఆంధ్ర ప్రదేశ్ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలుంటాయని... ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు,చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయిని వెదర్ మ్యాన్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు తీవ్రత కూడా పెరిగే అవకాశాలున్నాయని ప్రకటించారు. ఇలా ఏపీకి వర్షాలు, దట్టమైన పొగమంచు ప్రమాదం పొంచివుందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.