Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?

Published : Jan 01, 2026, 06:50 PM ISTUpdated : Jan 01, 2026, 07:06 PM IST

Hyderabad Zero Mile Stone : హైదరాబాద్ దూరాన్ని ఎక్కడి నుండి కొలుస్తారు..? జీరో మైలురాయి ఎక్కడుంది..? ఇలాంటి ఆసక్తికర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
14
హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారు..?

Hyderabad Zero Mile Stone : సాధారణంగా విజయవాడ నుండి హైదరాబాద్ కు దూరమెంత అనగానే టక్కున 278 కిలోమీటర్లు అని వినిపిస్తుంది. అలాగే వరంగల్ నుండి 146 కి.మీ, కరీంనగర్ నుండి 164 కి.మీ దూరంలో హైదరాబాద్ ఉంటుంది. అయితే ఈ దూరం ఎక్కడికి... మహాత్మా గాంధీ బస్టాండ్ కా లేక జూబ్లీ బస్టాండ్ కా, సికింద్రబాద్ రైల్వే స్టేషన్ కా. ఒక్కో చోటికి దూరం ఒక్కోలా ఉంటుంది.. మరి ఇంత కచ్చితంగా హైదరాబాద్ దూరాన్ని ఎలా చెబుతున్నాం...?

ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి నగరానికి ఓ జీరో పాయింట్ ఉంటుంది... దాన్ని జీరో పాయింట్ అంటారు. ఇలా హైదరాబాద్ లో ఏ పాయింట్ నుండి దూరం లెక్కిస్తారు..? జీరో పాయింట్ ఎక్కుడుంది? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

24
హైదరాబాద్ లో జీరో పాయింట్ మైలురాయి ఎక్కడుంది..?

ఏ ప్రాంతంనుండి అయినా హైదరాబాద్ కు కచ్చితమైన దూరం ఉంటుంది. అయితే నగరం చాలా విశాలమైనది... ఓ చివరినుండి మరో చివరకు 40-50 కిలోమీటర్ల దూరం ఉంటుంది... కాబట్టి ఒక్కో ప్రాంతం నుండి దూరం ఒక్కోలా ఉంటుంది. అందుకే నగరంలోని ఒకే ప్రాంతంనుండి దూరాన్ని కొలవాలని నిర్ణయించారు... అదే జీరో పాయింట్.

హైదరాబాద్ లో జీరో పాయింట్ నాంపల్లిలో ఉంది. పురాతన కట్టడం, ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ భవనం ఎదురుగా జీరో పాయింట్ మైలురాయి ఉంటుంది. A 1232 నంబర్ మైట్రో పిల్లర్ దగ్గర జీరో అంకెతో కూడిన మైలురాయి కనిపిస్తుంది... ఇక్కడినుండే హైదరాబాద్ నుండి ఏ ప్రాంతానికైనా దూరాన్ని కొలుస్తారు. ఇలా నాంపల్లి నగరానికి భౌగోళిక కేంద్రంగా పరిగణించబడుతోంది... ఇక్కడినుండే హైదరాబాద్ దూరాన్ని కొలుస్తారు.

34
నిజాం కాలంలో జీరో పాయింట్ ఏది..?

నిజాంల పాలనలో ప్రస్తుతమున్న నాంపల్లి కాదు... ఓల్డ్ సిటీలో జీరో పాయింట్ ఉండేది. పురాతన కట్టడం చార్మినార్ ను నగర దూరాన్ని కొలిచేందుకు ఉపయోగించేవారు. కానీ బ్రిటిషర్ల రాకతో సికింద్రాబాద్ ఏర్పడటం, నగరం విస్తరించడంతో ఈ జీరో పాయింట్ ను మార్చారు. నాంపల్లిలో అధికారికంగా జీరో పాయింట్ మైలురాయిని ఏర్పాటుచేశారు... అప్పటినుండి ఇప్పటివరకు ఇదే దూరాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తున్నారు.

44
భారతదేశానికి జీరో పాయింట్ ఏది..?

హైదరాబాద్ కు నాంపల్లి మాదిరిగానే భారతదేశానికి కూడా ఓ జీరో పాయింట్ ఉంది. మహారాష్ట్రలోని ప్రముఖ నగరం నాగ్ పూర్ లో జీరో మైల్ స్టోన్ ఉంది. అంటే ఇది దేశ భౌగోళిక కేంద్ర బిందువు... దీన్నికూడా బ్రిటీష్ కాలంలోనే ఏర్పాటుచేశారు. ఇక్కడినుండే అన్ని దూరాలను కొలుస్తారు. దేశంలోని ప్రాంతాలమధ్య దూరం, ఇతర దేశాలకు దూరాన్ని కూడా ఇక్కడినుండే కొలుస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories