Viral: సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల ఓ డాక్టర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. విక్రాంత్ సింగ్ పేరుతో ఉన్న ఈ డాక్టర్ చెబుతున్న వివరాలు ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఎవరీ డాక్టర్.? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి
కరీంనగర్‌కు చెందిన డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ తెలంగాణలో ప్రముఖ న్యూరాలజిస్ట్‌గా గుర్తింపు పొందిన వైద్యుడు. మెదడు, నరాల సంబంధిత వ్యాధుల చికిత్సలో ఆయనకు విశేష అనుభవం ఉంది. కరీంనగర్‌లోని “టైమ్ న్యూరోకేర్ హాస్పిటల్” ద్వారా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. న్యూరాలజీకి ప్రత్యేకంగా ఏర్పాటైన ఈ ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉండటం ప్రత్యేకత.
25
ఆధునిక వైద్యం
సాధారణంగా మెట్రో నగరాల్లో మాత్రమే కనిపించే 3-టెస్లా ఎంఆర్ఐ, 32-స్లైస్ సీటీ స్కాన్ వంటి యంత్రాలను కరీంనగర్‌లో అందుబాటులోకి తీసుకురావడం ఆయన కృషి. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద నగరాలకు వెళ్లకుండా తమ దగ్గర్లోనే మెరుగైన పరీక్షలు, చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో “ఆర్కిడ్ హాస్పిటల్స్”, “నందన్ డయాగ్నస్టిక్స్” ద్వారా కూడా వైద్య సేవలను విస్తరించారు.
35
విద్యాభ్యాసం, వైద్య శిక్షణ
కరీంనగర్‌లోనే పుట్టి పెరిగిన డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ తన విద్యాభ్యాసాన్ని కూడా అద్భుతంగా పూర్తి చేశారు. ఇంటర్నల్ మెడిసిన్‌లో ఎంఢీ చేసి, తర్వాత న్యూరాలజీలో డీఎం పూర్తి చేశారు. ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. పి.ఎల్. జాన్ ఇజ్రాయెల్ వద్ద శిక్షణ పొందడం ఆయన వైద్య నైపుణ్యానికి మరింత బలం చేకూర్చింది.
పక్షవాతం వచ్చిన రోగులకు అత్యవసర చికిత్సగా “థ్రాంబోలిసిస్” విధానాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువచ్చిన వైద్యుల్లో ఆయన ముందున్నారు. స్ట్రోక్ వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాల లోపు ఈ చికిత్స అందిస్తే రోగి త్వరగా కోలుకునే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ విధానం ద్వారా అనేక మందికి జీవితం తిరిగి ఇచ్చిన వైద్యుడిగా ఆయన పేరు సంపాదించారు.
55
సోషల్ మీడియాలో ఎందుకు వైరల్?
డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ వైద్యుడిగానే కాదు, ప్రజల్లో అవగాహన పెంచే వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్య విషయాలను సులభమైన భాషలో వివరిస్తుంటారు. ముఖ్యంగా క్యాన్సర్ కారకాలు, ఆహార అలవాట్లు, రోజువారీ జీవనశైలిపై చేసే వీడియోలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ఇటీవల ఆయన చేసిన ఒక సేవా ప్రకటనతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యారు. పేద విద్యార్థుల కోసం 100 మందికి స్కాలర్‌షిప్ ఇవ్వాలని ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.10 లక్షలు అందించనున్నారు. ఈ నిర్ణయం ఆయన సామాజిక బాధ్యతను ప్రతిబింబించింది.
సేవా దృక్పథం – సమాజానికి తిరిగి ఇచ్చే ప్రయత్నం
తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చానని, ఇతరుల సహాయంతోనే ఎదిగానని డా. విక్రాంత్ సింగ్ తెలిపారు. అదే స్పూర్తితో ఇప్పుడు పేద విద్యార్థులకు అండగా నిలవాలని నిర్ణయించారు. స్కాలర్‌షిప్ ఎంపికలో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం ద్వారా నిజంగా అవసరమైన వారికి సహాయం చేరేలా చూస్తున్నారు. “మన పిల్లల భవిష్యత్తు కోసం సమాజం బాగుండాలి” అనే సందేశాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. సంపన్నులు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.