ఈ జిల్లాల్లో వర్షాలు..
ఇదిలావుంటే ఇవాళ (ఏప్రిల్ 24) కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 35-40 కి.మీ వేగంతో) కూడిన వర్షాలుంటాయని హైదరాబాద్ వాతవారణ కేంద్రం హెచ్చరించింది... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.