Vegetable Price : మీరు ఈ వీకెండ్ కూరగాయల మార్కెట్ కు వెళుతున్నారా..? అయితే ధరలెలా ఉన్నాయో తెలుసుకొండి

Published : Dec 26, 2025, 09:48 AM IST

Weekend Vegetable Markets : ఉద్యోగులే కాదు గృహిణులకు కూడా వీకెండ్ లోనే ఖాళీ సమయం దొరికేది..  అందుకే చాలాచోట్ల శుక్ర, శని, ఆదివారాల్లో కూరగాయల సంతలు జరుగుతుంటాయి ఈ రోజుల్లోనే వారానికి సరిపడా కురగాయలు కొంటుంటారు.  

PREV
15
ఈ వారాంతం సంతల్లో కూరగాయల ధరలు...

Hyderabad Vegetable Price : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు కుప్పకూలి చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూరగాయల ఉత్పత్తి తగ్గింది. దీంతో మార్కెట్ లోకి సరఫరా తగ్గడంతో అమాంతం డిమాండ్ పెరిగింది… ఇలా కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గత నెల కిలో రూ.20 పలికిన కూరగాయలు కూడా ప్రస్తుతం రూ.40-50 కి చేరుకున్నాయి. ఈ ధరలు చూసి సామాన్యులు భయపడిపోతున్నారు.. పేద, మధ్యతరగతి ప్రజలపై ఈ చలి అదనపు భారం మోపింది.

గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి కాస్త నయం... కానీ పట్టణాలు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కూరగాయల ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇదే అదునుగా వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నాయి. కాబట్టి ఈ వారాంతం సంతల్లో మీరు కూరగాయలు కొనేముందు ఓసారి దేని ధర ఎంతుందో తెలుసుకొండి. తద్వారా సరైన ధరలకు కూరగాయాలు కొని డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.

25
టమాటా ధర ఎంతుంది?

టమాటా... తెలుగువారి వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయ. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది... మార్కెట్ కు వెళ్లేవారి కూరగాయల లిస్ట్ లో టమాటా ముందుంటుంది. మార్కెట్ లో కూడా కుప్పలు కుప్పలుగా టమాటాలు పోసి అమ్ముతుంటారు.

అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా టమాటా దిగుబడి తగ్గింది. దీంతో మార్కెట్ లో టమాటాకు డిమాండ్ పెరగడంతో ధరలు పైపైకి వెళుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్స్ లో కిలో టమాటా రూ.30-40 పలుకుతోంది... నాణ్యత బాగుంటే ఇంకా ఎక్కువ ధర ఉంటోంది... సూపర్ మార్కెట్స్ లో అయితే కిలో రూ.50 కంటే ఎక్కువగా ఉంది.

35
ఉల్లిపాయల ధర ఎంత?

ఉల్లిపాయల ధరలు కూడా పైపైకి ఎగబాకుతున్నాయి. కొంతకాలంగా కేవలం రూ.20 కే కిలో ఉల్లిపాయలు లభించగా ఇప్పుడు కిలో రూ.30 కి చేరింది... ఇదీ తక్కువ నాణ్యత గల ఉల్లిపాయల ధర. మంచి నాణ్యతగల ఉల్లిపాయలు రూ.40 కి అమ్ముతున్నారు. గతంలో రూ.100 ఐదారుకిలోలు వస్తే ఇప్పుడు కేవలం 3-4 కిలోలు మాత్రమే ఇస్తున్నారు.

ఈ ధరల పెరుగుదల సామాన్యులను భయపెడుతోంది... ఎందుకంటే ఉల్లిపాయల ధరలు ఒక్కోసారి సెంచరీ దాటుతుంది. రూ.100 నుండి రూ.200 లకు కిలో ఉల్లిపాయలు కొనుకున్న రోజులు ఉన్నాయి... అందుకే ఆస్థాయికి ధరలు పెరుగుతాయేమోనని భయపడిపోతున్నారు. అయితే ఉల్లిపాయలు ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి... కాబట్టి ధర తక్కువగా ఉన్నప్పుడే ఎక్కువగా కొనిపెట్టుకుంటే మంచిది.

45
కూరగాయల ధరలు

చిక్కుడు కిలో రూ 35-40

పచ్చిమిర్చి కిలో రూ.50-60

బీట్ రూట్ కిలో రూ.25-30

ఆలుగడ్డ కిలో రూ.30

క్యాప్సికం కిలో రూ.35-40

కాకరకాయ కిలో రూ.40-50

సొరకాయ కిలో రూ.30-40

బీన్స్ కిలో రూ.20-30

క్యాబేజీ కిలో రూ.20-30

క్యారెట్ కిలో రూ.45-50

వంకాయలు కిలో రూ.30-40

బెండకాయలు కిలో రూ.50-55

బీరకాయ కిలో రూ. 40-50

దొండకాయ కిలో రూ.40-45

55
ఆకుకూరల ధరలు

పాలకూర కిలో రూ.30-40 (కొంచెం పెద్దసైజు కట్ట ఒక్కటి రూ.20)

పూదీనా రూ.10-15 కట్ట

కరివేపాకు రూ.10 కట్ట (కిలో రూ.100)

కొత్తిమీర రూ.20 కట్ట, చిన్న కట్ట రూ.10

మెంతి కూర కిలో రూ.20

చామకూర కిలో రూ.20 లభిస్తున్నాయి.

గమనిక : ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.

Read more Photos on
click me!

Recommended Stories