IMD Cold Wave Alert : తెలంగాణ 33 జిల్లాలో ఈ నాల్రోజులూ చలే.. ఈ ఆరుజిల్లాల్లో అల్లకల్లోలమే..!

Published : Dec 26, 2025, 08:11 AM IST

Telangana Weather : ఈ నాల్రోజులు తెలంగాణలో చలిగాలులు కొనసాగుతాయని తెలంగాణ వాాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఓ ఆరుజిల్లాల్లో మాత్రం అల్లకల్లోలం తప్పదని హెచ్చరించింది. 

PREV
16
తెలంగాాణపై చలి పంజా

IMD Cold Wave Alert : తెలంగాణలో తీవ్రమైన చలి కొనసాగుతోంది... డిసెంబర్ ఆరంభంలో మొదలైన ఉష్ణోగ్రతల పతనం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ చలి, పొగమంచు ప్రజలను ఇబ్బంది పెడుతోంది. మరో నాలుగైదు రోజులు అంటే డిసెంబర్ చివరివరకు ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని... జనవరి 2026 లో ఉష్ఱోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

26
ఈ నాల్రోజులు తెలంగాణ వాతావరణం

ఇవాళ్టి (డిసెంబర్ 26, శుక్రవారం) నుండి సోమవారం (డిసెంబర్ 29) వరకు వాతావరణం ఎలా ఉండనుందో హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నాల్రోజులు ఏ జిల్లాల్లో అత్యల్పంగా, ఏ జిల్లాల్లో సాధారణ ఉష్ఱోగ్రతలు నమోదవుతాయో వెల్లడించింది. ఈ వాతావరణ సూచనల ప్రకారం చలి తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాత్రులు, తెల్లవారుజామున బయటకు వచ్చేవారు చలిగాలులతో జాగ్రత్తగా ఉండాలి.

36
ఈ ఆరు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ముందునుండి ఆదిలాబాద్, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే నాలుగు రోజులు కూడా ఈ జిల్లాలోనే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని... అత్యల్పంగా 5 నుండి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఈ ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం

46
ఈ జిల్లాల్లోనూ చలి

ఇక తెలంగాణలో పలు జిల్లాల్లో మధ్యస్థ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి... అంటే అటు అత్యల్పం కాదు ఇటు అత్యధికం కాదు. ఇలా హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్,మేడ్చల్ మల్కాజ్ గిరి, నిర్మల్, నిజామాబాద్,పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతాయని ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

56
ఈ జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు

తెలంగాణలోని మిగతా జిల్లాల్లో సాధారణ స్థాయిలో అంటే 15 డిగ్రీలకు పైగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయట. ఇలా భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, ఖమ్మం, మహబూబ్ నగర్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో సాధారణ వాతావరణం ఉంటుందని తెలిపింది. ఈ జిల్లాల్లో చలి తీవ్రత పెద్దగా ఉండదని... రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించిది.

66
హైదరాబాద్ వాతావరణం

తెలంగాణలో ఈ రెండుమూడు రోజులు శీతాకాలంలో ఉండే సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుండి 4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ విషయానికి వస్తే రోజంతా ఆకాశం నిర్మలంగా ఉంటుందని... సాయంత్రం లేదా రాత్రి పాక్షికంగా మేఘావృతం అయి వుంటుందని తెలిపింది. ఇక తెల్లవారుజామున విపరీతమైన పొగమంచు కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories