Today Vegetable Price : ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నెల (నవంబర్) ఆరంభంనుండి ధరలు మెల్లిగా పెరుగుతూ వస్తున్నాయి.. ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో సామాన్య మధ్యతరగతి జీవులకు బతుకుబండిని లాగడం మరింత భారంగా మారింది. ప్రస్తుతం ఏ కూరగాయ ధర చూసినా కిలో రూ.40-50 గా ఉంది... కొన్ని అయితే సెంచరీకి చేరువయ్యాయి. అమాంతం కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
సాధారణంగా ప్రతి వీకెండ్ లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు చిన్నచిన్న పట్టణాల్లోనూ కూరగాయల సంతలు జరుగుతాయి. వీకెండ్ లో ఖాళీగా ఉండే ఉద్యోగులు, గృహిణులు కూడా వీకెండ్ లోనే కూరగాయల మార్కెట్ కు వెళుతుంటారు. ఇలా మీరుకూడా కూరగాయలు కొనేందుకు వెళుతున్నారా..? అయితే మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలాముఖ్యం. దీంతో సరైన ధరలకు కూరగాయలను కొనుగోలు చేసే వీలుంటుంది... డబ్బులు వృథా కావు.