తెలంగాణ ఇంటర్‌మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. తొలి ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణత 66.89 శాతం, రెండో ఏడాది 71.37 శాతం మంది పాసైనట్లు భట్టి విక్రమార్క తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది పెరిందన్నారు. దీంతోపాటు ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిదే హవా కొనగిందని అన్నారు.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాంటే..?
* ఇందుకోసం ముందుగా ఫోన్ లేదా ల్యాప్ టాప్‌లో ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ అయిన tsbie.cgg.gov.inలోకి వెళ్లాలి.
* అనంతరం హోమ్ పేజీలో కనిపించే తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ 2025 లేదా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 2025 ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత హాల్ టికెట్‌తో పాటు పుట్టిన తేదీ లాంటి వివరాలను అందించాలి. ఆ తర్వాత సబ్‌మిట్ బటన్‌పై నొక్కాలి.
* వెంటనే రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం మార్కుల షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.
ఫలితాలపై అసంతృప్తి ఉంటే..
ఒకవేళ విద్యార్థులకు తమకు వచ్చిన ఫలితాలపై ఏమైనా అనుమానాలు లేదా అసంతృప్తి ఉంటే రీకౌంటింగ్ లేదా రీ-వెరిఫికేషన్ చేసుకోవచ్చు. రీకౌంటింగ్ ఫీజు సబ్జెక్టుకు రూ.100, రీ-వెరిఫికేషన్ కోసం రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఫలితాలు వచ్చిన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తారు.
సీఎం రేవంత్ శుభాకాంక్షలు...
ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మరింత ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక సీఎం రేవంత్ ఈరోజు జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా ట్విట్టర్‌లో విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.