ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతారణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నందాల, అనంతపురం, శ్రీ సత్యసాయి తదితర జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు తీవ్రమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. వడగళ్లు కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఐఎండీ సూచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) ఒక హెచ్చరిక జారీ చేసింది.