Rain alert
ప్రస్తుతం వేసవి తీవ్రతతో పాటు తేమ కూడా ఎక్కువగా ఉండటంతో, జనం తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తేమ శాతం 42% నుంచి 50% మధ్యగా ఉండడంతో ఉదయం భరించలేని ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 8 గంటలకే సూర్యుడు భగభగలు జనాలను చిరాకు పెడుతున్నాయి.
సాయంత్రం కాగానే వాతావరణం మారిపోతోంది. ఆకాశం మేఘాలతో కమ్ముకొని, పలు ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు కూడా నమోదవుతున్నాయి.
Rain Alert
ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు ఇలా కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఇప్పటికే 48 గంటల Yellow Alert (మధ్యస్థ స్థాయి హెచ్చరిక) జారీ చేసింది. ఈ రెండు రోజుల పాటు తుఫానులు, ఈదురుగాలుల అవకాశం ఉన్న జిల్లా పేర్లను ప్రకటించింది.
ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఉన్నాయి.
కాగా ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వనపర్తిలో
తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక్కడ ఏకంగా 41°C - 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మేడక్, రంగారెడ్డిలో ఉష్ణోగ్రతలు 38°C - 40°Cగా రికార్డ్ అవుతున్నాయి.
మొత్తంగా, రోజులో భాగంగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి, సాయంత్రం సమయంలో తుపాన్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
tamilnadu rain
ఇందులో భాగంగానే తాజాగా వాతావరణ శాఖ అధికారులు సోమవారం తెలంగాణలోని 16 జిల్లాలకు వర్ష సూచన ఉందని పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌కు వర్ష సూచన ఉందని తెలిపారు. మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తికి వర్ష సూచన ఉంది. అలాగే నారాయణపేట, గద్వాలలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపారు.