Christmas Tour : క్రిస్మస్ సెలవుల్లో టూర్ కోసం వేలకు వేలు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. కేవలం రూ.100 తోనే వంద ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన చర్చిలను చుట్టిరావచ్చు. ఇలా హైదరాబాద్ లో తప్పక చూడాల్సిన టాప్ 5 చర్చిలేవో తెలుసా?
Christmas Tour : డిసెంబర్ వచ్చిందంటే చాలు క్రిస్మస్ వైబ్స్ కనిపిస్తుంది. కేక్ మిక్సింగ్ వేడుకలు, శాంటా క్లాజ్ బహుమతులు, ఇళ్లను స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ తో అలంకరించడం... ఇలా ఈ నెలంతా పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాగే క్రిస్టియన్స్ ప్రార్థనా మందిరాలైన చర్చిలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంటాయి. అయితే క్రిస్మస్ సెలవుల్లో ప్రముఖ చర్చిలకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది... చాలామంది ఈ చర్చిల్లో ప్రార్థనలు చేయాలని కోరుకుంటారు.
క్రిస్మస్ వేళ ప్రాచీన మెదక్ చర్చిని సందర్శించాలని హైదరాబాద్ లో ఉండే చాలామంది కోరుకుంటారు. కానీ వివిధ కారణాలతో అంతదూరం వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటివారు ఏం బాధపడాల్సిన పనిలేదు... మెదక్ చర్చి మాదిరిగానే హైదరాబాద్ లో అనేక ప్రాచీన ప్రార్థనా మందిరాలున్నాయి. ప్రాచీన శైలిలో నిర్మించిన ఈ పురాతన చర్చిలు ఆకట్టుకుంటాయి... అక్కడ ప్రార్థన ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో అనేక ప్రాచీన చర్చిలు ఉన్నాయి... ఆర్టిసి బస్సులు, మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తూ వీటిని సందర్శించవచ్చు. ఓ వ్యక్తి కేవలం రూ.100-120 తో డే పాస్ తీసుకుని రోజంతా ఆర్టిసి సిటీ బస్సులు ప్రయాణిస్తూ చర్చిలను సందర్శించవచ్చు. ఇలా నగరంలో సందర్శించాల్సిన టాప్ చర్చిలేవో ఇక్కడ తెలుసుకుందాం.
26
1. సెయింట్ జార్జెస్ చర్చ్ (St.George's Church), బషీర్ బాగ్
హైదరాబాద్ లోనే అతి పురాతనమైన చర్చ్ ఈ సెయింట్ జార్జెస్... దీన్ని 1844 లో నిర్మించారు. ఈ చర్చ్ మత సామరస్యానికి ప్రతీకగా నిదర్శనం... ఆనాటి నిజాం రాజులు ఈ చర్చి కోసం స్థలాన్ని కేటాయించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ చర్చిలో క్రిస్మస్ ప్రార్థన ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఈ చర్చి పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నిండివుంటుంది.
36
2. సెంటెనరీ మెథడిస్ట్ చర్చ్ (Centenary Methodist Church), చాపెల్ రోడ్, ఆబిడ్స్
హైదరాబాద్ లోని అతి పెద్ద చర్చిల్లో ఈ సెంటెనరీ మెథడిస్ట్ చర్చి ఒకటి... ఇందులో దాదాపు 2 వేలమంది ఒకేసారి ప్రార్థన చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం ఇంగ్లీష్, తెలుగులోనే కాదు హిందీ, కన్నడ, మరాఠీలో కూడా ప్రార్థనలు ఉంటాయి. ఈ చర్చి ఆర్కిటెక్చర్ కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది.
3. ఆల్ సెయింట్ చర్చ్ (All Saints Church), సికింద్రాబాద్
18వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆల్ సెయింట్ చర్చ్ బ్రిటీష్ కాలం నుండి ఇప్పటివరకు ప్రముఖ ప్రార్థనా మందిరంగా వెలుగొందుతోంది. ఈ చర్చి గోథిక్ నిర్మాణశైలి సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఇది ప్రస్తుతం CSI (చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా) పరిధిలో ఉంది. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ చర్చ్ ఉంటుంది.
56
4. సెయింట్ జార్జ్ మార్తోమా చర్చ్ (St.Thomas Marthoma Church), ఖైరతాబాద్
హైదరాబాద్ నగరంలోని చాలా చర్చిలు పురాతనమైనవి... కాబట్టి నిర్మాణశైలి అద్భుతంగా ఉన్నా మెయింటెనెన్స్ సరిగ్గా లేక పాతబడినట్లు కనిపిస్తాయి. కానీ ఖైరతాబాద్ లోని సెయింట్ జార్జ్ మార్తోమా చర్చి అలా కాదు.. నేటి అత్యాధునికి హంగులతో అద్భుతంగా ఉంటుంది. ఈ చర్చిలో ప్రశాంతంగా ప్రార్థన చేసుకునే వాతావరణం ఉంటుంది.
66
5. ఆధునిక కమ్యూనిటీ చర్చిలు
ఇటీవలి కాలంలో కల్వరీ టెంపుల్ (కూకట్‌పల్లి), బెథెస్డా చర్చ్, హోప్ అన్‌లిమిటెడ్ చర్చ్ లాంటి ఆధునిక కమ్యూనిటీ చర్చిలు కూడా నగరంలో విస్తృతంగా ప్రజాదరణ పొందాయి. పెద్ద ప్రార్థనా సభలు, యువత కార్యక్రమాలు, సామాజిక సేవలు వీటి ప్రత్యేకత.
హైదరాబాద్ శివారు ముత్తంగిలో కూడా అద్భుతమైన చర్చి ఉంది... ఇక్కడ క్రిస్మస్ పండగవేళ ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఇలా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోనే కాదు శివారు ప్రాంతాల్లో కూడా అనేక చర్చిలు ఉన్నాయి.. మీకు నచ్చినవాటిని ఈ క్రిస్మస్ వేళ అతి తక్కువ ఖర్చుతో చుట్టిరండి.