Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ రవాణా వ్యవస్థలో కీలక మార్పులకు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. కోర్ సిటీ ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు నేరుగా చేరేలా ఎలివేటెడ్ కారిడార్లు, ఎక్స్‌ప్రెస్ వేలు రూపుదిద్దుకుంటున్నాయి.
ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలోని బంజారాహిల్స్, పంజాగుట్ట, మాసాబ్‌ట్యాంక్, మెహదీపట్నం, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు చేరడం ప్రస్తుతం పెద్ద సవాల్. ఇప్పటికే ఉన్న రోడ్లు ట్రాఫిక్‌తో నిండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలివేటెడ్ కారిడార్లు నేరుగా ఔటర్‌కు కనెక్టివిటీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడం వల్ల నగర కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలకూ డిమాండ్ పెరగనుంది.
25
బంజారాహిల్స్–గచ్చిబౌలి ఎక్స్‌ప్రెస్ వే
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఫిలింనగర్, జడ్జెస్ కాలనీ, దుర్గం చెరువు, టీ-హబ్ ప్రాంతం మీదుగా గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ వరకు ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్ వే ప్రతిపాదన వచ్చింది. దాదాపు పది కిలోమీటర్ల పొడవున ఈ రహదారి నిర్మాణం జరగనుంది. ఇందులో ఎక్కువ భాగం స్టీల్ బ్రిడ్జి రూపంలో ఉండనుంది. ఈ మార్గం ఐటీ కారిడార్‌కు వేగంగా చేరే అవకాశాన్నికల్పిస్తాయి.
35
గండిపేట - కాండూట్ రోడ్
మెహదీపట్నం నుంచి ఔటర్ వైపు వెళ్లే ఓల్డ్ ముంబై హైవేపై ట్రాఫిక్ పెరుగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా షేక్‌పేట నాలా నుంచి గండిపేట కాండూట్ వెంట మణికొండ దిశగా కొత్త రోడ్ అభివృద్ధి చేయనున్నారు. 200 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ చేపట్టేందుకు ప్లాన్ వేస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ దాదాపు ఏడు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి డిజైన్ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మణికొండ, అల్కాపూర్, నర్సింగి పరిసరాల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు భారీ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది.
సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు 18.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ బాధ్యత బెకెమ్ ఇన్‌ఫ్రాకు దక్కింది. ఈ ప్రాజెక్టు విలువ రూ.2,232 కోట్లు. ఇందులో ఆరు లైన్ల ప్లైఓవర్, గ్రౌండ్ లెవల్ రోడ్, హకీంపేట వద్ద అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంటాయి. ఈ మార్గం సిద్ధమైతే కరీంనగర్, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్ వైపు నుంచి నగరానికి సులువుగా చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా శామీర్‌పేట, ఆల్వాల్, మేడ్చల్ ప్రాంతాల్లో ప్లాట్లు, విల్లా ప్రాజెక్టుల ధరలు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
55
ఎలివేటెడ్ కారిడార్లతో రియల్ ఎస్టేట్ బూమ్
ఎలివేటెడ్ కారిడార్లు కేవలం రవాణా సదుపాయాలు మాత్రమే కాదు. ఇవి నగర విస్తరణకు దిశానిర్దేశం చేసే సాధనాలు. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు కొత్త పెట్టుబడుల కేంద్రాలుగా మారుతున్నాయి. ట్రావెల్ టైమ్ తగ్గడం, ఐటీ హబ్‌లకు వేగంగా చేరడం, లాజిస్టిక్స్ సౌలభ్యం పెరగడం వల్ల డెవలపర్లు ఈ మార్గాల చుట్టూ భారీ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ కారిడార్ల వెంట భూముల ధరలు, అద్దెలు, కమర్షియల్ స్పేస్ విలువలు వేగంగా పెరిగే అవకాశం ఉంది.