Top 10 Temples Telangana: తెలంగాణలో త‌ప్ప‌క చూడాల్సిన టాప్-10 దేవాలయాలు

Published : Aug 07, 2025, 09:20 PM IST

Top 10 Temples Telangana: తెలంగాణలోని చాలా ఆల‌యాలు చ‌రిత్ర‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం. రామ‌ప్ప నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు.. ఇక్క‌డ అత్యంత ప్రసిద్ధి గాంచిన దేవాల‌యాలు ఉన్నాయి. తెలంగాణ‌లో త‌ప్ప‌క చూడాల్సిన టాప్-10 టెంపుల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
తెలంగాణలోని 10 ప్రసిద్ధ దేవాలయాలు

Top 10 Temples Telangana: తెలంగాణలో పర్యాటకుల్ని ఆకట్టుకునే ఎన్నో భక్తి స్థలాలున్నాయి. ఈ రాష్ట్రంలోని ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు, కాలచక్రాన్ని ప్రతిబింబించే శిల్ప కళా నిపుణతకు నిదర్శనంగా ఉన్నాయి. చ‌రిత్ర‌కు సాక్ష్యాలుగా ఉన్నాయి. తెలంగాణలోని 10 ప్రసిద్ధి చెందిన దేవాలయాలను, వాటి ప్రత్యేకతలు, టైమింగ్స్, ట్రావెట్ వివ‌రాలు మీకోసం.

1. రామప్ప దేవాలయం

ములుగు జిల్లాలో కాకతీయుల కాలంలో నిర్మించిన‌ రామప్ప ఆలయం, శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీనిలోని శిల్పాలు, రాతి శిల్పాలు అపూర్వంగా ఉంటాయి. ఇది యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.

అక్టోబర్ నుంచి మార్చి మ‌ధ్య‌లో సంద‌ర్శ‌న‌కు బాగుటుంది. ప్రతి రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆల‌యం తెరిచి వుంటుంది. ములుగు నుంచి మంచి రోడ్డు మార్గం ఉంది.

2. వెయ్యి స్తంభాల గుడి

వ‌రంగ‌ల్ లోని హ‌న్మ‌కొండ‌లోని వేయి స్తంభాల గుడి కాకతీయుల నిర్మాణ కళకు ప్రతీక. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఒక స‌జీవ సంగీత నాట్యశాలలాగా ఉంటుంది. ఆలయంలోని శిల్పాలు, శిలా శాస్త్రాలు విశిష్టంగా ఉంటాయి. అక్టోబర్ నుంచి మార్చి మ‌ధ్య‌లో సంద‌ర్శ‌న‌కు అనుకూలంగా ఉంటుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆల‌యం తెరిచి వుంటుంది.

DID YOU KNOW ?
వేయి స్థంభాల గుడి
హన్మకొండలో ఉండే ఈ దేవాలయం 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించాడు. ఇది శివుడు, విష్ణువు, సూర్యుడు వెలసిన ఒక చారిత్రాత్మక ఆలయం. వెయి స్తంభాల కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది.
25
3. భద్రాచల రామాలయం

భద్రాచలం లోని గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రాచల రామాలయం ఎంతో ప్ర‌సిద్ది చెందింది. భక్తులు, పర్యాటకులు లక్షల సంఖ్యలో వచ్చే ప్రధాన ఆలయం. ఇది శ్రీరాముని జీవితం, ఆధ్యాత్మికతకు గుర్తింపు పొందింది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మ‌ధ్య‌లో ఆల‌య సంద‌ర్శ‌న మంచి ఫీల్ అందిస్తుంది. ఆల‌యం ఉదయం 4 నుంచి రాత్రి 9 వరకు తెరిచి ఉంటుంది.

4. ఛాయ సోమేశ్వరాలయం

న‌ల్గొండ‌లోని పానగల్ లో ఉన్న ఈ ఆలయంలో దేవునిపై పడే సూర్యకాంతి ఛాయ కారణంగా “ఛాయ సోమేశ్వర” అనే పేరు వచ్చింది. ఇది ఒక అద్భుత ఆర్కిటెక్చర్ కలిగిన ఆలయం. ఫిబ్రవరి నుంచి మార్చి మ‌ధ్య‌లో సంద‌ర్శ‌న‌కు అనుకూలమైన స‌మ‌యం. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆల‌యం తెరిచి ఉంటుంది.

35
5. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం (యాదాద్రి)

యాదాద్రిలోని లక్ష్మీ నరసింహ్మ స్వామి కోలువైన ఈ ఆలయం తెలంగాణ రాష్ట్ర ముఖ్య భక్తి స్థలాలలో ఒకటి. యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత ఈ ఆలయం మరింత వైభవంగా మారింది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వ‌ర‌కు సంద‌ర్శ‌న‌కు అనుకూలంగా ఉంటుంది. ఉదయం 4 నుంచి రాత్రి 9 వరకు ఆల‌యం తెరిచి వుంటుంది.

6. వేములవాడ రాజరాజేశ్వర ఆలయం

వేములవాడ లోని ఈ ఆలయాన్ని “దక్షిణ కాశి” అని పిలుస్తారు. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇది చారిత్రాత్మకత, భక్తి కలయికలు క‌లిగిన దేవాల‌యం. అక్టోబర్ నుంచి మార్చి మ‌ధ్య‌లో సంద‌ర్శ‌న‌కు మంచి స‌మ‌యం. ఉదయం 3 నుంచి రాత్రి 9 వరకు ఆల‌యం తెరిచి వుంటుంది.

45
7.బాసర సరస్వతీ దేవాలయం

చ‌దువుల త‌ల్లి సరస్వతి కొలువైన ఈ ఆల‌యం బాస‌ర‌లో ఉంది. ఈ ఆలయం విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. "అక్షరాభ్యాసం" కోసం కుటుంబాలు పెద్దఎత్తున వస్తాయి. అక్టోబర్ నుంచి మార్చి మధ్య సంద‌ర్శ‌న‌కు అనుకూలంగా ఉంటుంది. ఉదయం 4 నుంచి రాత్రి 8 వరకు ఆల‌యం సంద‌ర్శ‌న‌కు తెరిచి వుంటుంది.

8. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం

ప్రాణహిత, గోదావరి నదుల సంగమ స్థలంలో ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రికి వేలాది మంది వస్తారు. నవంబర్ నుంచి డిసెంబర్ మ‌ధ్య స‌మ‌యం సంద‌ర్శ‌న‌కు అనుకూలంగా ఉంటుంది. ఉదయం 4 నుంచి రాత్రి 9 వరకు ఆల‌యం తెరిచివుంటుంది.

55
9. భద్రకాళి అమ్మవారి ఆలయం

వరంగల్ లోని ఈ ఆలయంలో ఉగ్ర స్వరూపిణి అయిన భద్రకాళి కొలువై ఉన్నారు. చరిత్ర, నమ్మకం, ఉత్సవాలకు కేంద్రబిందువుగా ఉంది. అక్టోబర్ నుంచి మార్చి వ‌ర‌కు సంద‌ర్శ‌న‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ దేవాలయ ఉదయం 4 నుంచి రాత్రి 9 వరకు తెరిచి వుంటుంది.

10. కోమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం

కోముర‌వెల్లి లో మ‌హాదేవుడు మ‌ల్లికార్జున స్వామి రూపంలో మ‌ల్ల‌న్న‌గా ఇక్క‌డ కోలువై ఉన్నారు. కొండపై ఉన్నందున ప్రశాంతంగా ఉంటుంది. జనవరి నుండి మార్చి సందర్శ‌న‌కు మంచి స‌మ‌యం కాగా, ఇక్క‌డ మహాశివరాత్రి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకు దైవ ద‌ర్శ‌నం కోసం ఆల‌యం తెరిచి వుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories