Vegetable Prices : నిమ్మ ధర వింటే వామ్మో అనాల్సిందే... హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంత?

Published : Sep 06, 2026, 03:34 PM IST

కూరగాయల ధరలు సామాన్యులకు అంతుచిక్కని విధంగా మారుతున్నాయి. ఓవైపు నిమ్మకాయలు కిలో రూ.200-300కి చేరి దడ పుట్టిస్తుంటే... మరోవైపు టమాటా, బంగాళదుంప ధరలు తగ్గి కాస్త ఊరటనిస్తున్నాయి. మొత్తంగా ప్రస్తుతం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

PREV
14
కూరగాయల ధరలు

ఆదివారం... విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు సెలవురోజు. ఇలా హాలిడే ఉండటంతో వారానికి సరిపడా కూరగాయలు కొనేందుకు అందరికీ సమయం దొరుకుతుంది... అందుకే చాలాప్రాంతాల్లో ''సండే మార్కెట్'' జరుగుతుంటుంది. ఈరోజు హైదరాబాద్ వంటి నగరాలకు చుట్టుపక్కల గ్రామాలనుండి రైతులు వచ్చి కూరగాయలు అమ్ముకుంటారు... ఇక వ్యాపారుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... ఎక్కుడ మార్కెట్ ఉంటే అక్కడ వాలిపోతుంటారు.

అయితే ఇవాళ (సెప్టెంబర్ 6, ఆదివారం) సాయంత్రం మీరుకూడా గల్లీలో జరిగే మార్కెట్ కు వెళుతున్నారా? అయితే కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సిందే... లేదంటే నష్టపోయే అవకాశాలుపన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏ కూరగాయ ధర ఎంతుందో ఇక్కడ తెలుసుకుందాం.

24
నిమ్మ ధర వామ్మో అనిపిస్తోందిగా...

హైదరాబాద్ లోని పలు రైతు బజార్లు, వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు సామాన్యులకు మిశ్రమ అనుభూతిని కలిగిస్తున్నాయి. కొన్నింటి ధరలు ఆకాశంలో ఉంటే, మరికొన్ని నేల మీదకు దిగొచ్చాయి. ముఖ్యంగా నిమ్మకాయ, అల్లం, చిన్న ఉల్లిపాయల ధరలు ఇతర కూరగాయలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో టమాటా, బంగాళదుంప, బెండకాయ వంటివి తక్కువ ధరకే లభిస్తున్నాయి.

ముఖ్యంగా నిమ్మకాయ ధర అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. కిలో ఏకంగా రూ.250-300 పలుకుతోంది. డజన్ కాయలు రూ.100-200 అమ్ముతున్న పరిస్థితి ఉంది... ఈ లెక్కన కాయ 10 రూపాయలకు పైనే పలుకుతోందన్నమాట. గతంలో రూ.10-20 కి ఐదారు కాయలు తీసుకున్నవారు ఇప్పుడు ఒక్క కాయ ఆ ధర పలుకుతుండటం చూసి ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుత ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు… ఎండాకాలం మాదిరిగా అదిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కొనసాగుతోంది. దీంతో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగింది... ఇదే సమయంలో నిమ్మ పంట దెబ్బతిని దిగుబడి బాగా తగ్గింది. ఇలా సరఫరా తగ్గి డిమాండ్ పెరగడంతో నిమ్మకాయల ధర అమాంతం పైపైకి ఎగబాకి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.

ఇక అల్లం ధర కూడా పెరిగింది... కిలో రూ.100-150 చొప్పున అమ్ముతున్నారు. చిన్న ఉల్లిపాయల (సాంబార్ ఉల్లిపాయలు) ధర కిలో రూ.90గా ఉంది. మనం రోజూ వంటల్లో వాడే పెద్ద ఉల్లిపాయల ధర కూడా మెల్లిమెల్లిగా పెరుగుతోంది.. గతంలో రూ.20-25 కిలో ఉంటే ఇప్పుడు రూ.40-50 కి చేరింది. బీన్స్ ధర కూడా ఎక్కువగానే ఉంది.

34
హైదరాబాద్ లో కూరగాయల ధరలు

కూరగాయలు (కిలో ధర)

నిమ్మకాయ : రూ.250

అల్లం : రూ.150

చిన్న ఉల్లిపాయలు : రూ.90

పెద్ద ఉల్లిపాయలు : రూ.40-50

బీన్స్ : రూ.50-65

చిక్కుడు : రూ.50

మునగకాయ : రూ.50

క్యారెట్ : రూ.40-50

గోబి : రూ.30

దొండకాయ : రూ.30-40

కాకరకాయ : రూ.20-30

బీరకాయ : రూ.25-35

క్యాబేజీ : రూ.20-30

టమాటా: రూ.25-30

బీట్‌రూట్ : రూ.30

పచ్చి మిరపకాయలు : రూ.40-50

వంకాయ: రూ.25-30

బెండకాయ: రూ.30-40

ముల్లంగి : రూ.20

బంగాళదుంప: రూ.20-30

44
సామాన్యులకు సూచన..

మార్కెట్‌కు వచ్చే దిగుబడి, డిమాండ్, వాతావరణ పరిస్థితులను బట్టి కూరగాయల ధరలు రోజూ మారుతూ ఉంటాయని ప్రజలు గుర్తుంచుకోవాలి. అందుకే సండే మార్కెట్‌కు వెళ్లేవాళ్లు, చిరు వ్యాపారుల వద్ద కూరగాయలు కొనేవారు ఆ సమయానికి అసలు ధర ఎంతో ఒకసారి కనుక్కోవడం మంచిది.

ఈ వారం కూరగాయాల ధరల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నిమ్మకాయ రూ.250, అల్లం రూ.150 ధరలతో మంట పుట్టిస్తుంటే... బంగాళదుంప, బెండకాయ, టమాటా ధరలు తగ్గి వినియోగదారులకు కాస్త చల్లటి కబురు చెబుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories