Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 3 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఈ జిల్లాల్లో డేంజర్ గాలులు

Published : Sep 06, 2026, 09:00 AM IST

Weather Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

PREV
15
ఏపీ, తెలంగాణలో నేడు ఈ ప్రాంతాల్లో భారీ జల్లులు

ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఒక ఇంపార్టెంట్ అప్‌డేట్ ఇచ్చింది. వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా కూల్ న్యూస్ అని చెప్పవచ్చు. రాబోయే రెండు, మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, కొన్ని చోట్ల దంచికొట్టే భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించాయి.

తమిళనాడు తీర ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఒక బలమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడు దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఈ రెండింటి కదలికల వల్ల రాగల మూడు రోజులు వాతావరణం పూర్తిగా మారబోతోంది.

25
తెలంగాణ వాతావరణం: ఈ జిల్లాల ప్రజలు అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు వాతావరణం చాలా కూల్‌గా మారనుంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

మరోవైపు దక్షిణ, పశ్చిమ జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడవచ్చు.

35
హైదరాబాద్ వాసులకు అలర్ట్: సాయంత్రం జల్లులు

హైదరాబాద్ నగరంలో వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మారింది. ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం, రాత్రి వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 నుంచి 31 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22 నుంచి 23 డిగ్రీలుగా నమోదు కావచ్చు. ఆకస్మిక వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిలిచే ఛాన్స్ ఉన్నందున ప్రయాణికులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

45
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు.. ఉత్తర, దక్షిణ కోస్తాలకు అలర్ట్

ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, యానాం పరిసరాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆది, సోమవారాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.

ఇక దక్షిణ కోస్తా జిల్లాలైన కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

55
రైతులకు బిగ్ రిలీఫ్

రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రాబోయే మూడు రోజులు వాతావరణం చల్లబడి, ఉరుములతో కూడిన మోస్తరు జల్లులు పడనున్నాయి. వర్షాల కోసం, సాగు నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షాలు పెద్ద రిలీఫ్ ఇవ్వనున్నాయి.

అధికారుల ముఖ్యమైన సూచనలు

వర్షం పడే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి పొలాల్లో ఉండే రైతులు, కూలీలు విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉన్నందున సముద్రంలోకి వేటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బలమైన గాలుల వల్ల హోర్డింగ్‌లు, చెట్లు కూలే ప్రమాదం ఉన్నందున వర్షం సమయంలో ఇంట్లోనే ఉండటం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories