
School Holidays : వినాయక చవితికి వరుస సెలవులు వచ్చాయి... వీకెండ్ తో పండగ సెలవు కలిసిరావడంతో మూడ్రోజుల హాలిడేస్ వచ్చాయి. అయితే ఈ సెలవులు ముగియడంతో ఎక్కడ వినాయక మండపాలవద్ద ఎక్కువ సమయం గడపలేమో అని స్కూల్ విద్యార్థులు, కాలేజీ యువతతో పాటు ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. అయితే వీరికి ఊరటనిచ్చేలా వినాయక చవితికి మరికొన్ని సెలవులు కలిసిరానున్నాయి.
వినాయక చవితి అంటే విగ్రహాలను ప్రతిష్ఠించిన మూడ్రోజుల నుండి నిమజ్జనాలు ప్రారంభం అవుతాయి. 3,5,7,9 రోజుల్లో నిమజ్జనం చేస్తారు... గరిష్ఠంగా 11 రోజుల వనకు గణనాథులను పూజించి నిమజ్జనానికి తరలిస్తారు. హైదరాబాద్ తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్దపెద్ద వినాయక విగ్రహాలను 11 రోజులకే ఘనంగా నిమజ్జనం చేస్తారు. ఈ 11 రోజుల్లో విద్యాసంస్థలు, ఉద్యోగులకు ఎన్నిరోజుల సెలవులు వస్తున్నాయో ఇక్కడ చూద్దాం.
సెప్టెంబర్ 17 తెలంగాణకు చాలా ప్రత్యేకమైన రోజు. నిజాంల పాలన ముగిసి స్వాతంత్య్ర భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం ఇదేరోజు విలీనం అయ్యింది. అయితే ఈరోజును తెలంగాణ విమోచన దినంగా జరుపుకోవాలని కొందరు, తెలంగాణ విలీన దినంగా జరుపుకోవాలనే మరికొందరు వాదిస్తారు... కానీ గత బిఆర్ఎస్ పాలకులు దీన్ని 'తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం' అని, ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ 'తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం' పేరుతో వేడుకలు జరుపుతున్నాయి.
పేరు ఏదయినా సెప్టెంబర్ 17న అంటే ఈ గురువారం తెలంగాణలో వేడుకలు జరగనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అన్ని విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు, ఉద్యోగులకు అధికారిక సెలవు ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటిస్తే ఈరోజంతా గణపతి మండపాల వద్ద గడిపే అవకాశం విద్యార్థులకు వస్తుంది.
సెప్టెంబర్ 19న శనివారం... హైదరాబాద్ నగరంలో ఐటీ, కార్పోరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు వీకెండ్ రెండ్రోజులు సెలవు ఇస్తాయి. ఈ క్రమంలో ఈ ఉద్యోగుల పిల్లలు ఎక్కువగా చదివే విద్యాసంస్థలు కూడా శని, ఆదివారం రెండ్రోజులు సెలవు ఇస్తాయి. ఇలా కొన్ని విద్యాసంస్థలకు సెప్టెంబర్ 19 (శనివారం), సెప్టెంబర్ 20 (ఆదివారం) సెలవులు రానున్నాయి... ఈ విద్యార్థులకు రెండ్రోజులు గణపతి మండపాల వద్ద గడిపే అవకాశం వస్తుంది.
అయితే రాష్ట్రవ్యాప్తంగా శనివారం సెలవు లేకున్నా ఆదివారం పక్కా సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 20న స్కూల్ విద్యార్థులు, కాలేజీ యువత, ఉద్యోగాలు చేసేవారు.. ఇలా అందరూ వినాయక మండపాల వద్దే ఉంటారు. అన్నదానాలు, ప్రత్యేక కార్యక్రమాలతో ఈరోజు వినాయక మండపాల వద్ద సందడి నెలకొంటుంది.
వినాయక చవితికి ఎలాగయితే మూడ్రోజులు సెలవులు వచ్చాయో నిమజ్జనానికి కూడా కొందరికి మూడ్రోజుల సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా నిమజ్జనం వీకెండ్ లో రావడం హైదరాబాద్ వారికి బాగా కలిసిరానుంది. చదువుకునే విద్యార్థులు, ఉద్యోగాలు చేసేవారు వినాయక నిమజ్జనం ఘనంగా జరుపుకునేలా మూడ్రోజులు సెలవులు కలిసివస్తున్నాయి.
హైదరాబాద్ లో వినాయక నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి... హుస్సెన్ సాగర్ తో పాటు నగరంలోని చెరువులు, జలాశయాల వద్ద వినాయక నిమజ్జనాలు జరుగుతాయి. ఉదయం నుండే రోడ్లు బ్లాక్ అయిపోతాయి... వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. అందుకే హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో వినాయక నిమజ్జనం రోజు అధికారిక సెలవు ఉంటుంది.
అయితే ఈసారి వినాయక నిమజ్జనం సెప్టెంబర్ 25న అంటే శుక్రవారం వస్తోంది... ఈరోజు అధికారికంగా సెలవు ఉంటుంది. ఇక సెప్టెంబర్ 26 (శనివారం) అంటే వినాయక నిమజ్జనం తర్వాతిరోజు వీకెండ్ సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 27 ఎలాగూ ఆదివారమే కాబట్టి సాధారణ సెలవు ఉంది. ఇలా మొత్తంగా హైదరాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు వినాయక నిమజ్జనం సందర్భంగా మూడ్రోజుల సెలవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ వినాయక చవితి సెలవులే సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే వినాయక విగ్రహాల ప్రతిష్ఠ వేళ మూడ్రోజులు (సెప్టెంబర్ 12,13,14) సెలవులు వచ్చాయి. మధ్యలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కొందరికి సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. తర్వాత సెప్టెంబర్ 19 (శనివారం) వీకెండ్, సెప్టెంబర్ 20న ఆదివారం సెలవులున్నాయి. ఇక సెప్టెంబర్ 25న వినాయక నిమజ్జనం, సెప్టెంబర్ 26న (శనివారం) వీకెండ్, సెప్టెంబర్ 27 ఆదివారం సెలవులున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ వినాయక చవితికి 9 రోజులు సెలవులే వచ్చేలా ఉన్నాయి.