వరుసగా 3 రోజులు సెలవులు

Published : Sep 03, 2025, 07:58 PM IST

Three Consecutive Holidays: స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లేవారికి గుడ్ న్యూస్. తెలంగాణలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఆ వివరాలు మీకోసం.

PREV
16
తెలంగాణలో వరుసగా మూడు రోజులు సెలవులు

తెలంగాణలోని విద్యార్థులు, ఉద్యోగులకు ఈ వారం ప్రత్యేకంగా మారబోతోంది. సెప్టెంబర్ 5వ తేదీ (శుక్రవారం) నుంచి 7వ తేదీ (ఆదివారం) వరకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. మిలాద్ ఉన్ నబీ, వినాయక నిమజ్జనం, సాధారణ ఆదివారం కలిసొచ్చి విద్యార్థులకు, ఉద్యోగులకు లాంగ్ వీకెండ్ లభిస్తోంది.

26
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవు

సెప్టెంబర్ 5న ముస్లింలు పవిత్రంగా భావించే మిలాద్ ఉన్ నబీ పండగ జరగనుంది. ప్రవక్త మహ్మద్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆ రోజున స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు వుంది. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పనులు ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు.

36
వినాయక నిమజ్జన వేడుకలతో సెలవు

సెప్టెంబర్ 6 (శనివారం) వినాయక నిమజ్జనం సెలవు ఇచ్చారు. హైదరాబాద్ నగరం వినాయక నిమజ్జనోత్సవాలతో కళకళలాడనుంది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ముఖ్య ఆకర్షణగా ఉంటుంది. ఈ సందర్భంగా స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇచ్చారు. అత్యవసర విభాగాలు మినహా మిగిలిన అన్ని విభాగాలకు ఆ రోజు సెలవు ఇచ్చారు.

46
ఆదివారం సాధారణ సెలవు

సెప్టెంబర్ 7 ఆదివారం కావడంతో సాధారణ సెలవు వస్తోంది. దీంతో వరుసగా మూడు రోజులు.. శుక్రవారం, శనివారం, ఆదివారం విద్యార్థులు, ఉద్యోగులకు సెలువులు లభించాయి. ఈ లాంగ్ వీకెండ్‌ ను మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటే మీ కుటుంబంతో మంచి సమయం గడపవచ్చు. చిన్న టూర్లను కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

56
లాంగ్ వీకెండ్‌.. పర్యాటక యాత్రలకు మంచి సమయం

ఈ వరుస సెలవులు రావడంతో కుటుంబాలతో లేదా స్నేహితులతో కలిసి పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇది సరైన సమయం. ఎక్కువ దూరం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలకు సందర్శనకు వెళ్లవచ్చు. తెలంగాణలోని పర్యాటకం కోసం చాలా ప్రాంతాలే ఉన్నాయి. అయితే, ఈ సమయంలో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ప్రయాణం కోసం ముందుగానే టికెట్లు, వసతి సదుపాయాలు బుక్ చేసుకోవడంతో ఇబ్బందులు తప్పుతాయి.

66
సెప్టెంబర్ లో మరిన్ని సెలవులు

ఈ మూడు రోజుల లాంగ్ వీకెండ్ తరువాత కూడా విద్యార్థులకు సెప్టెంబర్ లో మరిన్ని సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు దాదాపు రెండు వారాలు సెలవులు ఇవ్వనున్నారు. 

ఇప్పటికే విడుదలైన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలల్లో 10 రోజులకు పైనే పండుగల సెలవులు ఉన్నాయి. మొత్తంగా, సెప్టెంబర్ నెలను ముందుగానే ప్లాన్ చేసుకుంటే విద్యార్థులు, ఉద్యోగులు విశ్రాంతి, విహారయాత్రలతో మంచి సమయాన్ని గడపవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories