తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత తమ కుటుంబసభ్యులు హరీష్ రావు, జోగినిపల్లి సంతోష్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి కేసీఆర్ పై కూడా కుట్రలు జరుగుతున్నాయి… ఆయన ఆరోగ్యం జాగ్రత్త అంటూ సోదరుడిని సూచించారు కవిత.
Kalvakuntla Kavitha : 'నాన్న ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న... అలాగే బిఆర్ఎస్ పార్టీని కూడా కాపాడండి' అంటూ తన సోదరుడు కేటీఆర్ ను కోరారు కల్వకుంట్ల కవిత. బిర్ఎస్ పార్టీలోంచి తనను సస్పెండ్ చేయడంతో ఇవాళ(బుధవారం) మీడియాముందుకు వచ్చారు కవిత... బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా.. ''నన్ను అడగకుండానే ఉరితీశారు... అసలు ఏమైందని అడగరా?'' అని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నించారు కవిత.
25
ఏమిటి... నువ్వు కేసీఆర్ కు కట్టప్పవా హరీష్? : కవిత
2018 ఎన్నికల్లో మాజీ మంత్రి హరీష్ రావు కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు అడిషనల్ ఫండింగ్ చేశారని కవిత ఆరోపించారు. బిఆర్ఎస్ పై కుట్రలు చేసేందుకే ఎమ్మెల్యేలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఇదంతా చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సంపాదించిన అవినీతి డబ్బులనే ఎమ్మెల్యేలకు పంచేందుకు ఉపయోగించారని అన్నారు. ''కేసీఆర్ కు తాను కట్టప్పను అంటావుగా... మరి ఎమ్మెల్యేలకు ఎందుకు ఫండింగ్ చేశావు'' అని హరీష్ రావును నిలదీశారు కవిత.
అసలు హరీష్ రావు బిఆర్ఎస్ (ఆనాటి టిఆర్ఎస్) పార్టీలోకి మధ్యలో వచ్చారు... ఆవిర్భావం నుండి లేరన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం తన పదవికి రాజీనామా చేసి టిడిపిలోంచి బయటకు వచ్చేటపుడు ఇదే హరీష్ రావు వద్దన్నారని తెలిపారు. ఆనాడు టిఆర్ఎస్ ఏర్పడిన 10 నెలల తర్వాత పార్టీలోకి వచ్చారన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని హరీష్ కలిశారు... ఎందుకు కలిశారో అందరికీ తెలుసన్నారు కవిత.
35
కేసీఆర్, కేటీఆర్ ను ఓడించేందుకు హరీష్ కుట్రలు...
రామన్న సిరిసిల్లలో ఓడించడానికి హరీష్ కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. అంతెందుకు ఒంటేరు ప్రతాప్ రెడ్డి ద్వారా కేసీఆర్ ను ఓడించాలని కూడా హరీష్ చూశారంటూ కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ వల్ల బెనిఫిట్స్ కావాలి... కానీ ఆయన పార్టీ నాశనం కావాలి అనేలా హరీష్ వ్యవహారిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈయనను పక్కనపెట్టుకుంటే నాశనమే... అందుకే కేసీఆర్, కేటీఆర్ మంచికోసమే ఆయనతో జాగ్రత్త అని చెబుతున్నానని అన్నారు. తనమీద ఇన్ని కుట్రలు జరిగినా నాన్న ఎందుకు చూడటంలేదంటూ కవిత ఆవేధన వ్యక్తం చేశారు.
ఆరడుగుల బుల్లెట్ ఇప్పుడు తనను గాయపర్చింది... భవిష్యత్ లో కేటీఆర్, కేసీఆర్ ను కూడా గాయపరుస్తుందని కవిత అన్నారు. హంపిలో కేసీఆర్ గురించి కొందరు బిఆర్ఎస్ నాయకులు అవమానకనకరంగా మాట్లాడిన వ్యవహారం బైటకు వచ్చింది... ఇది హరీష్ రావు గ్రూప్ పనే అని అన్నారు. తర్వాత కేటీఆర్ చేతులు పట్టుకుని తనపై చర్యలు తీసుకోకుండా ఆపుకున్నారని కవిత అన్నారు. బిఆర్ఎస్ లోంచి రఘునందన్ రావు, జగ్గారెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్ వంటివారు వెళ్లడానికి హరీషే కారణమన్నారు.
55
ఈటల, రఘునందన్ ను గెలిపించింది హరిషే : కవిత
రామన్న యూట్యూబ్, హరీష్ రావు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మేనేజ్ చేయడంలో ఆరితేరిపోయారని కవిత అన్నారు. అసలు ఈటల రాజేందర్, రఘునందర్ రావును గెలిపించింది హరీష్ రావే అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హరీష్ రావు నక్కజిత్తులు కనిపెట్టండని కేసీఆర్, కేటీఆర్ లకు సూచించారు కవిత. సంతోష్ రావు కూడా భారీ అవినీతికి పాల్పడ్డారని... వేలకోట్ల ఆస్తులు సంపాదించారని కవిత ఆరోపించారు.