కేసీఆర్ కూతురు కవిత వ్యవహారశైలి రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టిన కవిత మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులపై విమర్శలు చేస్తూ వస్తున్న కవిత సోమవారం ఏకంగా పేర్లతో సహా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పార్టీ ఉంటే పోతే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు, సంతోష్ రావుల వల్ల పార్టీ నాశనం అయ్యిందంటూ వ్యాక్యానించారు. దీంతో ఈ విషయాన్ని కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కవిత మంగళవారం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పంపుతున్నట్లు తెలిపారు. ఇక బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు... ఈ లేఖను బిఆర్ఎస్ పార్టీకి పంపిస్తున్నట్లు తెలిపారు.
24
ఆరడగుల బుల్లెట్ ఎవరికి గాయం చేస్తుంది.?
హరీష్ రావును ఉద్దేశిస్తూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడుతూ.. "అసెంబ్లీలో కాళేశ్వరం చర్చపై రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను నిందిస్తుంటే దానిని ఆరడగుల బుల్లెట్‌లా అడ్డుకున్నాడంటూ పార్టీ నేతలు గొప్పలు చెప్పారు. మరి చివరికి ఆ బుల్లెట్ ఎవరికి గాయం చేస్తుంది? ఈరోజు నన్ను గాయపరిచింది, రేపు రామన్నను గాయం చేస్తుందో, కేసీఆర్ గారిని గాయం చేస్తుందో తెలియదు. రామన్న జాగ్రత్తగా ఉండండి. హరీష్ రావు గారి కారణంగా జగ్గారెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, రఘునందన్ రావు లాంటి వారందరూ పార్టీ నుంచి వెళ్లిపోయారు. దుబ్బాక నియోజకవర్గంలో ఓటమికి హరీష్ రావు కారణం" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
34
నక్క జిత్తులను గమనించండి.
హరీష్ రావు చేసే నక్క జిత్తుల వ్యవహారలను గమనించాలని కేసీఆర్‌కు కవిత సూచన చేశారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదని, బబుల్ మేకర్ అన్నారు. తనకు పదవులపై ఆశ లేదని, ఉద్యమం నుంచి వచ్చాను, ఉద్యమంలోకి వెళ్తాను అంటూ కవిత చెప్పుకొచ్చారు. పార్టీని వెన్నుపోటు పొడుద్దాం అని గతంలో ప్లాన్ చేశారని ఆరోపణలు చేశారు. హరీష్‌రావును నమ్ముకుని ఈటల, మైనంపల్లి సహా అంతా పార్టీని వీడారు. ఒకే విమానంలో రేవంత్‌తో కలిసి హరీష్ ప్రయాణించారని కవిత ఆరోపించారు.
అధికారంలోకి వస్తామనుకొని ఉద్యమంలోకి రాలేదన్న కవిత.. తన తండ్రి కోసమే వచ్చామని చెప్పుకొచ్చారు. అందుకే తమ కుటుంబంపై కుట్ర జరుగుతోందన్నారు. కూరలో ఉప్పు ఎలా ఉంటుందో సంతోష్ రావు అలా ఉంటారన్న కవిత.. ప్రతీ పనిని చెడగొట్టేందుకు ఆయన ముందుంటారని అన్నారు. సంతోష్ రావుకు ధన దాహం ఎక్కువ అంటూ కవిత ఆరోపించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సినిమా తారలను మోసం చేశారని కవిత చెప్పుకొచ్చారు.