Weather Update: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలు

Published : Sep 28, 2026, 09:08 AM IST

Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రెండు రోజులు వర్షాలు వుంటాయని భారత వాతవరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.

PREV
15
బిగ్ అలర్ట్: మళ్లీ ముంచెత్తనున్న వానలు .. ఈ ప్రాంతాలకు అలర్ట్

ఇటీవల వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు తీవ్ర బీభత్సాన్నే సృష్టించాయి. జనజీవనం స్తంభించిపోవడంతో పాటు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే, గత కొన్ని రోజులుగా వర్షాలు తగ్గి ముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా ఈ సమయంలో వాతావరణ శాఖ మరో కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

25
తెలంగాణలో ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై ఈ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్గొండ జిల్లాలకు వాతావరణ శాఖ రాబోయే 48 గంటల పాటు ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

35
ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు

ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణం మారిపోయింది. కోస్తాంధ్రా ప్రాంతాలపై సముద్ర గాలుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. విజయవాడ, వైజాగ్ సహా విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎపీఎస్డీఎంఏ (APSDMA) తెలిపింది. గోదావరి, కృష్ణా జిల్లాల్లో పగలు ఉక్కపోత ఉన్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి జల్లులు కురుస్తాయి. తీర ప్రాంతాల్లో గంటకు 30-40 కిమీ వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉన్నందున మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

45
హైదరాబాద్ లోనూ వర్షాలు

హైదరాబాద్ నగరం (GHMC) పరిధిలో వాతావరణం భిన్నంగా ఉండబోతోంది. ఉదయం పూట ఆకాశం మేఘావృతమై ఉండి ప్రశాంతంగా అనిపించినా, మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు 31 నుండి 33 డిగ్రీల వరకు నమోదవుతాయి. అయితే సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వాతావరణం మారనుంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో.. ముఖ్యంగా కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, సికింద్రాబాద్, అల్వాల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

55
పిడుగుల ముప్పు.. అధికారుల ముఖ్య సూచనలు

రుతుపవనాల తిరోగమనం, ద్రోణి ఎఫెక్ట్ వల్ల వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

• వర్షం కురుస్తున్న సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర నిలబడకూడదు.

• బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా భవనాల్లో సురక్షితంగా తలదాచుకోవాలి.

• నగరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు ఎప్పటికప్పుడు స్థానిక వెదర్ అప్‌డేట్స్ గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.

మరోవైపు ఉత్తర భారతంలోనూ వాతావరణం దారుణంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు, పిడుగుల దాడికి దాదాపు 56 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం అని అధికారులు సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories