School Holidays: ఎగిరి గంతేసే న్యూస్‌.. ఈ వారంలో వ‌రుస‌గా 3 రోజులు సెల‌వులు. ఎప్పుడెప్పుడంటే..?

Published : Aug 11, 2025, 05:02 PM IST

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో సెల‌వుల సీజ‌న్ న‌డుస్తోంది. మొన్న‌టి వ‌ర‌కు వ‌ర్షాల కార‌ణంగా ఆ త‌ర్వాత రాఖీ పండుగ‌కు వ‌రుస సెల‌వులు రాగా, తాజాగా మ‌ళ్లీ వ‌రుస సెల‌వులు రానున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. 

PREV
15
మరోసారి హాలీడే సీజన్

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మరోసారి శుభవార్త. ఇటీవల వరుసగా వచ్చిన సెలవులు ముగియగానే, మరోసారి హాలీడేలు రాబోతున్నాయి. ఈ విరామంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే అవకాశం విద్యార్థులకు, ఉద్యోగులకు దొరకనుంది. ఇప్పటికే ఆగస్టు నెలలో పాఠశాలలకు సెలవులు వచ్చిన విషయం తెలిసిందే.

25
ఆగస్టు 15 నుంచి వరుస సెలవులు

ఈ వారం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పబ్లిక్ హాలీడే ఉంటుంది. విద్యార్థుల‌కు హాఫ్ డే స్కూల్ ఉండ‌గా, ఆఫీసుల‌కు పూర్తి స్థాయిలో సెల‌వు ఉంటుంది. కాగా అంతకంటే రెండు రోజుల ముందు నుంచి పాఠశాలలో పలు క్రీడా, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. ఇక త‌ర్వాత రోజు ఆగ‌స్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ. తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలు విస్తృతంగా జరుగుతాయి. ఈరోజు కూడా పాఠ‌శాల‌ల‌కు సెల‌వు ఉంటుంది.

35
ఆదివారం సెల‌వు

ఆగస్టు 17 ఆదివారం కావడంతో ఈ సారి విద్యార్థులు, ఉద్యోగులకు 15, 16, 17 తేదీల్లో వరుసగా మూడు రోజులు హాలీడేలు వస్తున్నాయి. అంటే ఈ వారాంతం ఏకంగా మూడు రోజులు వ‌రుస సెల‌వులు వ‌స్తాయ‌న్న‌మాట‌. దీంతో చిన్న చిన్న ట్రిప్స్ ప్లాన్స్ చేసుకోవ‌డానికి ఇది బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

45
ఇప్ప‌టికీ మూడు రోజులు సెల‌వులు

ఇటీవలే ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీ పౌర్ణమి, 10న ఆదివారం వరుసగా వచ్చి విద్యార్థులు, ఉద్యోగులకు మూడు రోజుల విరామం ఇచ్చాయి. ఆ విశ్రాంతి తాలూకు ఉత్సాహం ఇంకా తగ్గకముందే మళ్లీ వరుస హాలీడేలు రావడం విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో మరింత ఆనందాన్ని కలిగిస్తోంది.

55
వ‌రుస సెల‌వుల‌తో పెరిగిన ర‌ద్దీ

ఈ వరుస సెలవులను ఉపయోగించుకుని చాలామంది స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా ట్రైన్, బస్ రిజర్వేషన్లు వేగంగా జరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే హాట్‌గా కొనసాగుతుండటంతో ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ ఆగస్టు నెలలో విద్యార్థులు పాఠశాలకు కేవలం 20 రోజుల పాటు మాత్రమే హాజరవుతారని అంచనా.

Read more Photos on
click me!

Recommended Stories