Hyderabad: ఈరోజు ల‌క్ష‌లు పెడితే రేపు కోట్లు అవుతాయి.. హైద‌రాబాద్‌కు స‌మీపంలో కొత్త రియ‌ల్ హాట్‌స్పాట్

Published : Aug 11, 2025, 11:17 AM IST

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. ఒక‌ప్పుడు కూక‌ట్‌ప‌ల్లి న‌గ‌ర శివారుగా ఉండేది. కానీ ప్ర‌స్తుతం సంగారెడ్డి వ‌ర‌కు క్ర‌మంగా న‌గ‌రం వ్యాపిస్తోంది. ఇదిలా ఉంటే హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్‌లో ఇప్పుడు కొత్త హాట్‌స్పాట్ తెర‌పైకి వ‌చ్చింది. 

PREV
15
హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌లో కొత్త హాట్‌స్పాట్

హైదరాబాద్‌లో ప్రీమియం ప్లాట్లు వెతుకుతున్న వారికి సదాశివపేట్ పేరు ఇప్పుడు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఒకప్పుడు సాధారణ ప‌ట్ట‌ణంగా ఉన్న ఈ ప్రాంతం, ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌లో కొత్త పెట్టుబడి కేంద్రంగా మారుతోంది. ఇన్వెస్టర్లు, డెవలపర్లు, హోమ్ బాయర్లు అందరూ ఈ ప్రాంతంపై దృష్టి పెడుతున్నారు.

25
అత్యుత్తమ లొకేషన్ కనెక్టివిటీ

సదాశివపేట్‌ హైదరాబాద్‌ అవుట్‌స్కర్ట్స్‌లో, ముంబై హైవే (NH-65) పక్కన ఉంది. పటాన్‌చేరు, సంగారెడ్డి, హైటెక్ సిటీ వంటి కీలక కమర్షియల్‌ జోన్‌లకు సులభమైన క‌నెక్టివిటీ క‌లిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్‌ ద్వారా నగరంలోని ఏ ప్రాంతానికైనా త్వరగా చేరుకునే అవ‌కాశం ఉంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రీజినల్ రింగ్ రోడ్‌ (RRR) ప్రాజెక్ట్ పూర్తవగానే ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్‌ విలువ మరింత పెరగనుంది.

35
అందుబాటు ధ‌ర‌లోనే ప్లాట్లు

సెంట్రల్ హైదరాబాద్‌లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, సదాశివపేట్‌లో ఇంకా తక్కువ ధరలకే ప్రీమియం విల్లా ప్లాట్లు, రెసిడెన్షియల్‌ ప్లాట్లు దొరుకుతున్నాయి. ఇక్కడి ప్లాట్లు స్వంత నివాసం కోసం మాత్రమే కాకుండా, దీర్ఘకాల పెట్టుబడికి కూడా అనువుగా ఉంటాయి. ఓపెన్ ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో విల్లా ప్లాట్లు ఇలా అన్ని రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

45
వేగంగా పెరుగుతున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగావకాశాలు

సదాశివపేట్‌లో స్కూల్స్‌, కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌, షాపింగ్ కాంప్లెక్సులు, రెస్టారెంట్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధి కూడా జోరుగా ఉంది. TSIIC ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్‌ కారిడార్లు, SEZలు, పెప్సీకో ప్లాంట్, జహీరాబాద్‌ IT పార్కులు ఏర్పడుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ఇక్కడ క్వాలిటీ హౌసింగ్ డిమాండ్‌ మరింత పెరగనుంది.

55
ఈరోజు పెట్టుబ‌డి పెడితే

బీహెచ్ఈఎల్ నుంచి సంగారెడ్డి వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ కూడా మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో స‌దాశివ పేట‌కు మ‌రింత వేగంగా చేరుకునే అవ‌కాశం ల‌భిస్తుంది. దీంతో భ‌విష్య‌త్తులో ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్‌కు హాట్‌స్పాట్‌గా మారుతుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం వేల‌ల్లో ప‌లుకుతోన్న గ‌జం ధ‌ర త్వ‌ర‌లోనే భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. కాబ‌ట్టి భ‌విష్య‌త్తు కోసం పెట్టుబ‌డి పెట్టే వారికి సదాశివపేట బెస్ట్ ఆప్ష‌న్‌గా చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories