హైదరాబాద్‌లో స్టార్టప్‌లు 2024లో మొత్తం 571 మిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడులు సంపాదించాయి. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 5 వేల కోట్లకుపైమాటే. ఇది 2023తో పోలిస్తే 160% పెరుగుదల. ఈ ఫండింగ్ 81 రౌండ్ల ద్వారా లభించింది. ఈ వివరాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ది ఆగస్ట్ ఫెస్ట్ 2025 ముగింపు కార్యక్రమంలో వెల్లడించారు. ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైన ఈ ఫెస్ట్‌లో 7,600 మంది ఇన్నోవేటర్స్, వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు పాల్గొన్నారు.
DID YOU KNOW ?
160 శాతం పెరుగుదల
2023తో పోల్చితే 2024లో హైదరాబాద్‌లో స్టార్టప్‌లలో పెట్టుబడులు ఏకంగా 160 శాతం పెరగడం విశేషం.
25
‘ఇన్నోవేషన్ సిలికాన్ వ్యాలీ వరకే పరిమితం కాదు’
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, సృజనాత్మక ఆలోచనలు ప్రపంచంలో ఎక్కడైనా పుట్టొచ్చు అని, అవి కేవలం సిలికాన్ వ్యాలీ వంటి టెక్ హబ్‌లకు మాత్రమే పరిమితం కావని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచ ఇన్నోవేషన్ మ్యాప్‌లో ఒక ప్రకాశించే కేంద్రంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
35
రంగాల వారీగా పెట్టుబడుల పెరుగుదల
* హెల్త్‌టెక్ రంగం 2,139% అద్భుతమైన వృద్ధి సాధించి, 300 మిలియన్ డాలర్లు పెట్టుబడులు సంపాదించింది.
* ఫిన్‌టెక్ రంగం కూడా దాదాపు రెట్టింపు పెరుగుదలతో 105 మిలియన్ డాలర్లు ఫండింగ్ పొందింది.
* లేట్-స్టేజ్ ఫండింగ్ 701% పెరిగి 297 మిలియన్ డాలర్లుకి చేరుకుంది.
* ఎర్లీ-స్టేజ్ ఫండింగ్ 73% పెరిగి 233 మిలియన్ డాలర్లు అయింది.
హైదరాబాద్ ప్రస్తుతం భారతదేశంలో మహిళా ఆధ్వర్యంలోని స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చే నగరాల్లో 6వ స్థానంలో ఉంది. మొత్తం 531 మహిళా నేతృత్వంలోని స్టార్టప్‌లు కలిపి 417 మిలియన్ డాలర్లు ఫండింగ్ పొందాయి. STPI హైదరాబాద్ సహకారంతో ఇప్పటివరకు 1,400కుపైగా స్టార్టప్‌లు ప్రోత్సాహం పొందాయి, వీటిలో 44% మహిళా ఆధ్వర్యంలో ఉన్నాయి. కొత్త ప్రణాళికల్లో 200 ఎకరాల AI సిటీ, జీనోమ్ వ్యాలీ విస్తరణ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే FedEx, London Stock Exchange, Uber వంటి అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రాన్ని కేంద్రంగా ఎంచుకోవడం, తెలంగాణ పెట్టుబడి ఆకర్షణను చూపిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
55
హెరిటేజ్ బిల్డింగ్‌గా ‘మైత్రివనం’
అమీర్‌పేట్‌లోని మైత్రివనం భవనంను హెరిటేజ్ బిల్డింగ్‌గా ప్రకటించాలనే JA చౌదరి ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనుంది. 1992లో మొదటి STPI హైదరాబాద్‌ను ఇక్కడ స్థాపించారు. ఇది నగరంలోని ఆధునిక ఐటీ రంగానికి పునాది వేసిన ప్రదేశంగా గుర్తింపు పొందింది.