చీమలకు భ‌య‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న మ‌హిళ‌.. కామెడీగా ఉన్నా మ్యాట‌ర్‌ చాలా సీరియ‌స్

Published : Nov 06, 2025, 04:33 PM IST

Telangana: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో అనూహ్య సంఘ‌ట‌న జ‌రిగింది. మ‌నీషా అనే ఓ వివాహిత చీమ‌ల‌కు భ‌య‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. మైర్మేకోఫోబియా (Myrmecophobia) అనే అరుదైన మానసిక సమస్య కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

PREV
15
తీవ్ర విషాదం

మనీషా (25) అనే మహిళ మంచిర్యాల జిల్లా వాసి చిందం శ్రీకాంత్ (35)తో 2022లో వివాహం జరిగింది. వారికి అన్విక (3) అనే కుమార్తె ఉంది. దంపతులు ఉద్యోగరీత్యా అమీన్‌పూర్‌లోని నవ్య హోమ్స్‌లో నివసిస్తున్నారు. అయితే మనీషాకు చిన్నప్పటి నుంచే చీమలంటే తీవ్రమైన భయం ఉండేది. ఈ భయం ఆమె రోజువారీ జీవితాన్ని క్రమంగా ప్రభావితం చేస్తూ వచ్చింది.

25
ఏం జ‌రిగిందందంటే.?

నవంబర్ 4, 2025న ఉదయం శ్రీకాంత్ డ్యూటీకి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వ‌చ్చాక డోర్ కొట్టాడు. అయితే మ‌నీషా ఎంత‌కీ డోర్ ఓపెన్ చేయ‌లేదు. దీంతో పొరుగువారి సహాయంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ల‌గా.. మనీషా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని వేలాడుతూ క‌నిపించింది. శ్రీకాంత్ ఇంటికి వ‌చ్చే స‌మ‌యానికి మ‌నీషా ప్రాణాలు కోల్పోయింది.

35
సూసైడ్ లెట‌ర్‌లో..

ఘటనా స్థలంలో పోలీసులు మనీషా రాసిన ఓ లేఖను గుర్తించారు. అందులో, “శ్రీ, ఐ యామ్ సారీ… ఈ చీమలతో బ్రతకడం నా వల్ల కాదు. అన్వి జాగ్రత్త. అన్నవరం, తిరుపతి హుండీలో 1116 రూపాయలు వేయి. ఎల్లమ్మ వడి బియ్యం మర్చిపోకు” అని రాసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

45
మైర్మేకోఫోబియా అంటే ఏమిటి?

చీమ‌ల‌కు భ‌య‌ప‌డ‌డాన్ని Myrmecophobiaగా చెబుతుంటారు. ఇది ఒక రకమైన ఫోబియా. అంటే ఏదైనా ఒక నిర్దిష్ట వస్తువు లేదా ప్రాణిని చూసి అసహజంగా భయపడటం. ఈ ఫోబియాతో బాధపడేవారిలో కనిపించే కొన్ని ప్రధాన లక్షణాలు ఇవి:

* చీమలను చూడగానే లేదా వాటి గురించి విన్న వెంటనే గుండె వేగంగా కొట్టుకుంటుంది.

* శరీరంలో వణుకు, చెమటలు వస్తాయి.

* ఊపిరి ఆడకపోవడం, ఆందోళన పెరగడం.

* చీమలు తమపై పాకుతాయనే భయంగా ఉండ‌డం.

* ఇంటిని తరచూ పరిశుభ్రం చేయడం, చీమలు కనిపిస్తాయేమోనని భయపడడం.

* ఇది కేవలం చిన్న సమస్యలా అనిపించినా, బాధితులకు ఇది నిజమైన మానసిక నరకం వంటిదే.

55
ప‌రిష్కారం లేదా.?

మైర్మేకోఫోబియా చికిత్స చేయలేని వ్యాధి కాదు. సరైన కౌన్సిలింగ్, సైకాలజికల్ థెరపీ ద్వారా దీనిని అధిగమించవచ్చు. కొన్ని సందర్భాల్లో వైద్యుల సూచనలతో మందులు కూడా ఉపయోగపడతాయి. భయాన్ని క్రమంగా ఎదుర్కోవడం, రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్చుకోవడం ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories