తెలంగాణ‌లోని ఈ న‌గ‌రం మ‌రో హైద‌రాబాద్ కావ‌డం ఖాయం.. ఎయిర్‌పోర్ట్ స‌హా కీల‌క ప్రాజెక్టులు

Published : Jan 04, 2026, 07:34 AM IST

Telangana: తెలంగాణ‌లో పెద్ద న‌గ‌రం ఏది అంటే ఠ‌క్కున హైద‌రాబాద్ అనే స‌మాధానం వ‌స్తుంది. అయితే హైద‌రాబాద్‌తో స‌మానంగా ఇప్పుడు మ‌రో న‌గ‌రం అభివృద్ధి చెందుతోంది. ఎయిర్‌పోర్ట్‌తో పాటు భారీ మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌తో వేగంగా మారుతోంది. 

PREV
14
ద‌శాబ్ధాల క‌ల మామునూర్ విమానాశ్రయం

వరంగల్ ప్రజల చిరకాల కోరిక అయిన మామునూర్ విమానాశ్రయ పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విస్తరణ కోసం అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 295 కోట్ల నిధులు ఇప్పటికే విడుదలయ్యాయి. 150 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మ‌రో ఎయిర్ పోర్ట్ ఉండ‌కూడ‌ద‌న్న నిబంధనల కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. తాజాగా ప్రభుత్వ చొరవతో ఆ అడ్డంకులు తొలగిపోవడంతో పనులు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణకు దేశ, అంతర్జాతీయ కనెక్టివిటీ పెరుగుతుంది.

24
ఓఆర్ఆర్, కొత్త రహదారులు

విమానాశ్రయానికి అనుసంధానంగా నగర చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ దాకా కొత్త రహదారులు నిర్మించనున్నారు. ఇవి నగర ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా పారిశ్రామిక ప్రాంతాలకు మెరుగైన క‌నెక్టివిటీ అందించ‌నున్నాయి. ఇది వ‌రంగ‌ల్‌ని ఆధునిక రవాణా కేంద్రంగా మార్చే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

34
రైల్వే ఫ్యాక్టరీ, మెగా టెక్స్‌టైల్ పార్క్

కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే తయారీ కేంద్రం పనులు చివరి దశలో ఉన్నాయి. సుమారు రూ. 521 కోట్లతో చేపట్టిన ఈ కేంద్రం ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయి. మరోవైపు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. పీఎం మిత్ర పథకం కింద కేంద్ర నిధులు రావడంతో వస్త్ర రంగంలో వరంగల్ కీలక కేంద్రంగా ఎదిగే అవకాశాలు పెరిగాయి.

44
వైద్య, పట్టణ సదుపాయాల్లో విప్లవాత్మక మార్పు

వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ. 1,800 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ఉత్తర తెలంగాణ ప్రజలకు ఆధునిక వైద్య సేవలను దగ్గర చేస్తుంది. అదే సమయంలో నగరంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు కూడా శ్రీకారం చుట్టారు. మొదటి దశలో రూ. 500 కోట్లతో ఈ వ్యవస్థ అమలులోకి రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories