పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. గంటకు 60 కిమీ వేగంతో గాలులు
రుతుపవనాల ముందస్తు ఆగమన సూచనలతో తెలంగాణకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వానల ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.