Published : Jun 26, 2025, 09:25 PM ISTUpdated : Jun 26, 2025, 09:27 PM IST
తెలుగు రాష్ట్రాల్లో గురువారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో తెలుసా?
Telangana Weather : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇన్నిరోజులు వర్షాల కోసం ఎదురుచూసిన ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది... ఆకాశం మేఘాలతో కమ్మేసి చిరుజల్లులు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇవి ఇక భారీ వర్షాలకు మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
25
తెలుగు రాష్ట్రాల్లో ఈ రాత్రి కుండపోత తప్పదా?
ఇప్పటికే రుతుపవనాలు యాక్టివ్ గా మారాయి... వీటికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనాలు, అల్పపీడనాలు తోడవుతున్నాయి. దీంతో అసలైన వర్షాకాలం ఇప్పుడే ప్రారంభం అవుతోంది... మెళ్లిగా ప్రారంభమైన వర్షాలు ఇక ఊపందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గురువారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
35
ఈ తెలంగాణ జిల్లాలకు వార్నింగ్
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయట. ఇక ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి... అయితే ఈ రాత్రి కుండపోతకు అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనే దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గురువారం నగరంలో అక్కడక్కడా చిరుజల్లులు కురిసాయి... రాత్రికి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు కూడా ఆస్కారం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇలా వర్షాలు కురిసే తెలంగాణ జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేాశారు.
55
ఏపీలో కూడా భారీ వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా గత రెండుమూడు రోజులుగా వర్షాలు ప్రారంభమయ్యాయి.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ముసురు పట్టింది. జూన్ చివర్లో ప్రారంభమైన ఈ వర్షాలు మరింత జోరందుకుంటాయని చెబుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.