Hyderabad woman drives car on railway track: హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లి వద్ద ఒక యువతి కారుతో రైల్వే ట్రాక్‌పై హల్ చల్ చేసింది. రీల్స్ కోసం ఇలా చేసిందా? లేదా ఆ యువతికి పిచ్చా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
శంకర్‌పల్లిలో కారుతో రైల్వే ట్రాక్‌పైకి దూసుకెళ్లిన యువతి
Hyderabad woman drives car on railway track: ఓ యువతి తీసుకున్న అత్యుత్సాహం పెను ప్రమాదం తెచ్చిపెట్టే విధంగా మారింది. హైదరాబాద్ సమీపంలో యువతి కారును రైలు ట్రాక్‌పై నడిపి కలకలం రేపింది.
మద్యం మత్తులో ఉన్న యువతి తన కారును నేరుగా రైల్వే ట్రాక్‌పైకి నడిపించింది. ఈ ఘటనతో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చుట్టుపక్కల ఉన్న వారు భయాందోళనకు లోనయ్యారు. సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
25
హైదరాబాద్ శంకర్‌పల్లి పరిధిలో ఘటన
హైదరాబాద్ శంకర్‌పల్లి వద్ద గురువారం జరిగిన అసాధారణ ఘటన స్థానికులను, రైల్వే సిబ్బందిని భయాందోళనకు గురి చేసింది. ఓ మహిళ మద్యం మత్తులో కారుతో నేరుగా రైల్వే ట్రాక్‌పైకి ప్రవేశించడంతో రైలు రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ ఘటన క్రమంలో అక్కడున్న కొందరు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో వైరల్ గా మారాయి. విషయం తెలుసుకుని పోలీసులు, రైల్వే అధికారులు రంగంలోకి దిగారు.
రైల్వే ట్రాక్‌పై స్పీడ్ గా కారు రైడ్
ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా నాగులపల్లి-శంకర్‌పల్లి మధ్య రైలు పట్టాలపై ఈ ఘటన జరిగింది. రైల్వే గేట్ ఆపరేటర్ ఒక తెల్లటి వాహనం ట్రాక్ వైపు వస్తుండటం గుర్తించాడు. అతను వెంటనే వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశాడు, కానీ మహిళా డ్రైవర్ ఏమీ పట్టించుకోలేదు. అక్కడున్న స్థానికులు కూడా ఆపే ప్రయత్నం చేయగా వేగంగా దూసుకొచ్చింది.
ఆపరేటర్ కారును కొంతదూరం వరకు అనుసరించి వెంటనే అధికారులను అప్రమత్తం చేశాడు. ఈ ఘటనతో స్థానికులతో పాటు రైల్వే సిబ్బంది ఒకింత షాక్‌కు లోనయ్యారు.
35
ట్రాక్ పక్కన చెట్లను ఢీ కొని ఆడిన కారు
ఆ యువతి కారును ట్రాక్ వెళ్తుండగా పలువురు ఆపే ప్రయత్నం చేయగా, ఆమె డ్రైవింగ్ ను కొనసాగించారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ట్రాక్ పక్కనే ఉన్న చెట్లకు కారు ఢీకొనడంతో చివరికి ఆగింది. ఈ ప్రమాదంలో కారు అద్దాలు పూర్తిగా పగిలిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ఈ ఘటన అక్కడి స్థానికులు, ప్రయాణికులలో భయాందోళనలను కలిగించింది. ఆ సమయంలో సమీపంలో ఉన్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది వెంటనే ట్రాక్‌ను ఖాళీ చేయించారు. అప్రమత్తమైన అధికారులు వాహనాన్ని ట్రాక్ నుంచి తీసివేశారు.
ప్రాథమిక నివేదికల ప్రకారం, కారు నడిపిన యువతి మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. ఆమె ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన రబిక సోనీగా గుర్తించారు. శంకర్‌పల్లి పోలీసులు ఆమెను వికారాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించారు.
55
ఈ ఘటనతో రైలు రాకపోకలపై ప్రభావం
ఈ ఘటన కారణంగా ఈ మార్గంలోని రైలు సేవలు తాత్కాలికంగా ఆలస్యం అయ్యాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇది అత్యవసర చర్యగా తీసుకుని రైలు సేవలను నిలిపివేశారు. రైల్వే అధికారులు ట్రాక్‌ను పరిశీలించిన తరువాత మాత్రమే రాకపోకలు మళ్లీ ప్రారంభించారు.
రైల్వే ట్రాకుపై కారుతో యువతి హల్ చల్.. వీడియో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీడియోలో మహిళ ట్రాక్‌పై కారుతో వేగంగా వెళ్తుండటం, ట్రాక్ పక్కనే ఉన్న వ్యక్తులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించడం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు ఇప్పుడు అధికార విచారణలో కీలక ఆధారాలుగా ఉన్నాయి.
రైల్వే శాఖ ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది. ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు, మహిళ ఎలా ట్రాక్ మీదికి ప్రవేశించింది? ఎందుకు వచ్చింది? భద్రత లోపాలు ఏమిటన్న దానిపై విచారణ జరుగుతోంది.