School: గుడ్ న్యూస్.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, LKG, UKG

Published : Jun 11, 2025, 08:17 PM IST

Govt Schools to Start Nursery LKG UKG: సెలవుల తర్వాత స్కూల్స్ రీఓపెన్ సమయంలో తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 విద్యా సంవ‌త్స‌రం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించనున్నారు.

PREV
16
ప్రీ ప్రైమరీ విద్యపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

Govt Schools to Start Nursery LKG UKG: తెలంగాణ ప్రభుత్వ గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌భుత్వ పాఠశాలల్లో ఇకపై నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు కూడా ఉంటాయ‌ని పేర్కొంది. ప్రైవేట్ పాఠశాలలలో మూడేళ్ల నుంచే విద్య ప్రారంభమవుతుండటంతో ప్రభుత్వ బ‌డుల్లో కూడా ఇదే విధంగా విద్యా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలోని 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

26
విద్యా వ్య‌వ‌స్థ‌లో మార్పుల‌కు రేవంత్ స‌ర్కారు శ్రీకారం

ప్ర‌భుత్వ బ‌డుల్లో న‌ర్స‌రీ, ఎల్‌కేజీ, యూకేజీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి 2025 ఏప్రిల్ 10న హైదరాబాద్ మంచిరేవులలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో ప్రకటించారు.

‘‘విద్య, ఉపాధి, ఆరోగ్యం.. ఇవే మా ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలు. తరగతి గదులే దేశ భవిష్యత్తు ఆలయాలు. దేశ అభివృద్ధికి బలమైన విద్యావ్యవస్థ అవసరం’’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

36
ప్ర‌భుత్వ బ‌డుల్లో చిన్నారుల కోసం ప్రత్యేక తరగతులు
  • నర్సరీ తరగతులు: 3 ఏండ్ల వయసు చిన్నారులకు, ఆటల ఆధారంగా స్కిల్స్ అభివృద్ధిపై దృష్టి పెడ‌తారు.
  • ఎల్‌కేజీ: 4 ఏండ్ల చిన్నారులకు అక్షరాలు, అంకెలు, చిత్రాలు, ఆటలను నేర్పించడంపై దృష్టి పెడ‌తారు.
  • యూకేజీ: 5 ఏండ్ల వయసు వారికి ప్రాథమిక రీడింగ్, రైటింగ్, అంకగణితం అంశాలు నేర్పుతారు.

ఈ తరగతులు ప్లే బేస్డ్ లెర్నింగ్ మోడల్‌ను అనుసరిస్తాయని అధికారులు తెలిపారు.

46
సమగ్ర శిక్ష పథకం కింద అమలు

ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణను సమగ్ర శిక్ష పథకం ద్వారా అమలు చేయనున్నారు. జిల్లా విద్యాశాఖాధికారులు (DEOs) అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.

56
అంగన్ వాడీ కేంద్రాల్లో స‌రికొత్త‌గా ఆహార విధానం

అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా చిన్నారుల ఆకర్షణ కోసం నూతన ఆహార విధానం అమలులోకి వచ్చింది. జూన్ 11న ప్రారంభమైన కేంద్రాల్లో చిన్నారులకు ఎగ్ బిర్యానీని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మొదటి రోజు అందించారు.

మంచి ఆహారం ద్వారా పిల్ల‌ల‌కు పోష‌కాలు అంద‌డంతో పాటు హాజరు శాతాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మెనూను ప్రతిరోజూ భిన్నంగా ఉండేలా మారుస్తామని అధికారులు వెల్లడించారు.

66
ప్రైవేట్ స్కూళ్లతో పోటీకి ప్రభుత్వ స్కూళ్లు సిద్ధం

ప‌లు రిపోర్టుల ప్ర‌కారం.. ప్రస్తుతానికి ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 18.5 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఈ గ్యాప్‌ను తగ్గించేందుకు, బడికి రావ‌డానికి చిన్నారుల కోసం ప్రభుత్వం ఉచిత రవాణా సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories