తెలంగాణ‌లో ఉచిత చీర‌ల పంపిణీకి డేట్ ఫిక్స్‌.. ఈసారి చీర‌లు ఎంత బాగున్నాయో చూశారా?

Published : Nov 07, 2026, 02:43 PM IST

Telangana: తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇందిరా మహిళాశక్తి పథకం కింద ఉచితంగా చీరలు పంపిణీ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. నవంబర్ 19 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.

PREV
15
నవంబర్ 19న చీరల పంపిణీ ప్రారంభం

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

25
95 లక్షల మంది మహిళలకు లబ్ధి

ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 95 లక్షల మంది మహిళలకు చీరలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.334 కోట్లను కేటాయించింది. అర్హులైన మహిళలందరికీ నిర్ణీత సమయంలో చీరలు అందించేందుకు జిల్లాల వారీగా పంపిణీ ప్రణాళిక రూపొందిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డులు కలిగిన కుటుంబాల్లోని మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించనున్నారు. పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వారం రోజుల పాటు చీరలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

35
ఈసారి చీరల రంగులో ప్రత్యేక మార్పు

ఈ ఏడాది మహిళలకు అందించే చీరల విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా రంగుల ఎంపిక చేసింది. గతంలో పాలపిట్ట రంగు చీరలను పంపిణీ చేయగా.. ఈసారి చిలకపచ్చ రంగుకు ఎరుపు రంగు జరీ అంచును జోడించారు. మహిళలకు నాణ్యమైన చీరలు అందించడంతో పాటు రాష్ట్రంలోని చేనేత, వస్త్ర పరిశ్రమలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చింది. ఏప్రిల్ నెల నుంచే చీరల తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. సిరిసిల్లతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉత్పత్తి చేపట్టారు.

45
ఇప్పటికే 65 లక్షల చీరల తయారీ పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయాల్సిన 95 లక్షల చీరల్లో ఇప్పటివరకు సుమారు 65 లక్షల చీరల తయారీ పూర్తయింది. వీటిని ఇప్పటికే వివిధ జిల్లాలకు తరలించారు. మిగిలిన చీరల తయారీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఉత్పత్తి పూర్తయిన వెంటనే వాటిని సంబంధిత జిల్లా కేంద్రాలకు చేరవేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరాగాంధీ జయంతి రోజునే పంపిణీ ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుగానే ఈ కార్యక్రమానికి తేదీని ఖరారు చేసింది. లక్షల సంఖ్యలో చీరలు పంపిణీ చేయాల్సి ఉండటంతో రవాణా, నిల్వ, పంపిణీ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

55
ఆధార్ కార్డు తప్పనిసరి.. ప్రత్యేక యాప్‌తో పంపిణీ

చీరల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అర్హులైన మహిళలు పంపిణీ కేంద్రాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకెళ్లాలి. అక్కడ సంబంధిత పంచాయతీ అధికారులు ఆధార్ వివరాలను పరిశీలించి, యాప్ ద్వారా లబ్ధిదారుల ఫొటోలను నమోదు చేస్తారు. వివరాల ధ్రువీకరణ పూర్తయిన తర్వాత చీరను అందజేస్తారు. ఇప్పటికే చీర అందుకున్న మహిళకు మరోసారి పంపిణీ కాకుండా ఈ విధానం ఉపయోగపడుతుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సిబ్బందితో పాటు సెర్ప్ ఉద్యోగులకు పంపిణీ బాధ్యతలు అప్పగించారు. తద్వారా అర్హులైన ప్రతి మహిళకు ఈ పథకం ప్రయోజనం చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Read more Photos on
click me!

Recommended Stories