New Life Insurance Scheme: ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రూ.5 లక్షల బీమా పథకం వివరాలు ఇవే

Published : Nov 06, 2026, 11:15 AM IST

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్ 19న సిద్దిపేటలో రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం కానుంది. ఆ వివరాలు మీకోసం.

PREV
15
తెలంగాణలో మరో కొత్త పథకం లాంచ్.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భరోసా

సామాజిక సంక్షేమాన్ని ప్రతీ ఒక్కరికీ చేరవేయడం, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా మార్చడం, రాష్ట్రంలోని మౌలిక వసతులను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో పలు ప్రాధాన్యం కలిగిన పథకాల అమలు, ఉద్యోగాల నియామకం, చట్టాల సవరణపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు.

25
నవంబర్ 19న సిద్దిపేటలో రెండు కొత్త పథకాల లాంచ్

దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19వ తేదీన సిద్దిపేటలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడి నుంచే రెండు బిగ్ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు..

• ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ వర్తించేలా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. దీనికోసం నవంబర్ 20 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే జరగనుంది. గ్రామాల్లోని ఇందిరమ్మ కమిటీలు నేరుగా ఇళ్లకు వెళ్లి అప్లికేషన్లు సేకరిస్తాయి. వీటిని తహశీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు వెరిఫై చేస్తారు.

• చీరల పంపిణీ: ఇదే సభ నుంచి రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు ఉచిత చీరల పంపిణీ రెండో విడతను అధికారికంగా ప్రారంభించనున్నారు.

35
గ్రాండ్ లెవెల్లో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి'

రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండుగను వినూత్నంగా జరుపుకోవాలని కేబినెట్ ఫిక్స్ అయ్యింది. ఇప్పటివరకు 2,25,000 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పండుగ వేడుకల్లో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కొడంగల్‌లోని ఒక ఇందిరమ్మ ఇంట్లో జరగబోయే దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు.

45
కొడంగల్ పర్యటనలో సీఎం

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటన చివరి రోజున (నవంబర్ 9) భారీ రైతు బహిరంగ సభతో పాటు మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో నిర్వహించనున్నారు. ఇక డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగబోయే 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026'ను విజయవంతం చేయడంపై కూడా సీనియర్ అధికారులకు బాధ్యతలు కేటాయించారు.

55
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

అత్యవసర సమయంలో రక్షణ చర్యలు సులభతరం చేసేందుకు 'తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్-1999'కి సవరణలు చేశారు. అలాగే భూ వివాదాల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి 'తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్-1923'లోని సెక్షన్ 12(A)ను సవరించి, అప్పీల్ దాఖలు చేసే టైమ్ లిమిట్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. ఎల్-నినో వల్ల వచ్చిన కరవు పరిస్థితులు, కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించేందుకు త్వరలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేబినెట్ ప్రకటించింది.

Read more Photos on
click me!

Recommended Stories