Revanth Reddy Japan Visit : తెలంగాణలో జపాన్ సంస్థలు పెట్టే పెట్టుబడులెన్ని? వచ్చే ఉద్యోగాలెన్నో తెలుసా?

Published : Apr 23, 2025, 06:57 PM ISTUpdated : Apr 23, 2025, 07:02 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఓ టీమ్ వారంరోజుల పాటు జపాన్ లో పర్యటించింది. మంగళవారంతో ఈ పర్యటన ముగియగా బుధవారం ఉదయం రేవంత్ టీమ్ హైదరాబాద్ కు చేరుకుంది. ఈ పర్యటన ద్వారా తెలంగాణకు వచ్చే పెట్టుబడులెన్ని? తద్వారా ఏర్పడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలెన్ని? ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
14
Revanth Reddy Japan Visit : తెలంగాణలో జపాన్ సంస్థలు పెట్టే పెట్టుబడులెన్ని? వచ్చే ఉద్యోగాలెన్నో తెలుసా?
Revanth Reddy Japan Visit

Revanth Reddy Japan Visit : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగిసింది. ఏప్రిల్ 16న  మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందంతో కలిసి రేవంత్ రెడ్డి జపాన్ వెళ్లారు... దాదాపు వారంరోజుల పాటు ఈ పర్యటన కొనసాగింది. తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు చేపట్టిన ఈ పర్యటన బుధవారంతో ముగిసింది. ఇవాళ ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం తెలంగాణకు చేరుకుంది. 

అయితే ఈ పర్యటన ద్వారా భారీ పెట్టుబడులను తీసుకువచ్చినట్లు రేవంత్ బృందం చెబుతోంది. ఈ నిధులు కేవలం రాష్ట్ర అభివృద్ధికే కాదు ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింత పెరిగేలా తోడ్పడతాయని చెబుతున్నారు. ఇలా జపాన్ నుండి తెలంగాణకు ఎన్ని పెట్టుబడులు రానున్నాయి? సీఎం  బృందం ఏఏ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది? ఈ పెట్టుబడుల వల్ల వచ్చే ఉద్యోగాలెన్ని? ఇక్కడ తెలుసుకుందాం. 

24
Revanth Reddy Japan Visit

రేవంత్ రెడ్డి టీమ్ ఒప్పందాలు చేసుకున్న జపాన్ సంస్థలివే : 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడిన తెలంగాణ టీమ్  వారంరోజుల పాటు జపాన్ లో విస్తృతంగా పర్యటించారు. ఆ దేశానికి చెందిన చాలామంది పెట్టుబడిదారులు, వ్యాపార సంస్థలను మన దేశానికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే పలు సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. 

హైదరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికకు జపాన్ దిగ్గజ సంస్థ మారుబెనీ సహకరించేందుకు సిద్ధమైంది. రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో 600 ఎకరాల్లో దీన్ని  డెవలప్ చేయనున్నారు. ఈ ఇడస్ట్రియల్ పార్క్ ద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు, 30 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. 

ఇప్పటికే హైదరాబాద్ శివారులోని రుద్రారంలో తోషిబా ప్లాంట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తోషిబా ట్రాన్స్ మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇండియా ఆధ్వర్యంలో మరో రూ.562 కోట్లతో విద్యుత్ పరికరాల తయారీ ప్యాక్టరీని ఏర్పాటుచేయనున్నారు. ఈ మేరకు తెలంగాణతో ఒప్పందం చేసుకుంది తోషిబా సంస్థ. 

34
Revanth Reddy Japan Visit

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయ్యాయి ఎన్టిటి డేటా, నెయిసా సంస్థలు. ఈ రెండు సంస్థలు డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు సిద్దమయ్యాయి. ఈ మేరకు రూ.10,500 కోట్ల పెట్టుబడులతో ఒప్పందం చేసుకున్నాయి.  

జపాన్ లోని టిజియూకే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాజ్ గ్రూప్ లతో తెలంగాణ ఓవర్సీస్ మాన్ పరర్ కంపనీ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది.  ఈ రెండు సంస్థల ద్వారా 500 మందికి ఉద్యోగాలు కల్పించే ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం రేవంత్  టీమ్ తో ఒప్పందం జరిగింది. 

ఇలా అనేక సంస్థలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని టీమ్ ఒప్పందాలు చేసుకుంది. మొత్తంగా ఈ జపాన్ పర్యటనలో రూ.12,062 కోట్ల పెట్టుబడులను రేవంత్ సర్కార్ ఆకర్షించింది. త్వరలోనే జపాన్ సంస్థలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్దం కానున్నాయి. 
 

44
Revanth Reddy

జపాన్ కంపనీల ఎంట్రీతో తెలంగాణలో ఉద్యోగాలే ఉద్యోగాలు :

జపాన్ కంపనీలు పెట్టుబడుల ద్వారా తెలంగాణలో భారీగా ఉద్యోగకల్పన జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోని దాదాపు 30,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రేవంత్ సర్కార్ చెబుతోంది. జపాన్ కు చెందిన దిగ్గజ కంపనీల రాకతో ప్రత్యక్షంగా ఉద్యోగాలే కాదు పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 

ఒక్క మారుబెనీ కంపనీ ద్వారానే 30 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.  ఈ సంస్థ ఫుడ్, మైనింగ్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, మౌలిక వసతులు, ఏరోస్పేస్ రంగాల్లో పనిచేస్తోంది... అంటే ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నమాట. తెలంగాణలో ఈ సంస్థ పెట్టుబడులు గేమ్ చేంజర్ గా ప్రభుత్వం పేర్కొంటోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories