తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఏఏ జిల్లాలకు ఏ అలర్ట్ జారీ చేసారో ఇక్కడ తెలుసుకుందాం.
Telugu States Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే నదులు, వాగులు వంకలు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, జలాశయాలు నిండుకుండలుగా మారాయి. ఇలాంటి సమయంలో తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
26
ఈ తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో రెడ్ అలర్ట్ జారీచేసింది. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో పదకొండు జిల్లాల్లో చెదురుమదురు జల్లులు పడే అవకాశాలు ఉన్నాయట... ఈ జిల్లాలకు గ్రీన్ అలర్ట్ జారీ చేశారు.
36
పొంచివున్న వరదలు
అతిభారీ వర్షాలు కురిసే జిల్లాలకు వరద ప్రమాదం పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఇక వికారాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వర్షాలకు ఈదురుగాలులు కూడా తోడవుతాయని... గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
రాజధాని నగరం హైదరాబాద్ కు కూడా రెయిన్ అలర్ట్ జారీచేశారు. నగరంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయంటూ హై అలర్ట్ జారీ చేసారు. ఈ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి... దీంతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సైబరాబాద్ పోలీసుల సూచిస్తున్నారు.
56
ఆంధ్ర ప్రదేశ్ లోనూ కుండపోతే...
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని... దీని ప్రభావంతో వర్షాలు మరింత జోరందుకుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న మూడ్రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి... పలుచోట్ల అత్యంత భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
66
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు
ఇవాళ (బుధవారం) అల్లురి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.