Andhra Pradesh Weather : తెలుగు ప్రజలు మరికొద్దిరోజులు వర్షాలు కోసం ఎదురుచూడాాల్సిందేనని ఐఎండి హెచ్చరికలను బట్టి తెలుస్తోంది. తిరిగి వర్షాలు ఎప్పుడు మొదలవనున్నాయో తెలుసా?
Telugu States Weather : తెలుగు రాష్ట్రాల్లో మరో వారంరోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ అంచనాలను బట్టి తెలుస్తోంది. జులై లో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి... కానీ గత నాలుగైదు రోజులుగా వర్షాల జాడలేదు. ఇదే పరిస్థితి ఆగస్ట్ ఫస్ట్ వీక్ కొనసాగుతుందని... సెకండ్ వీక్ నుండి మళ్లీ వర్షాలు మొదలవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
DID YOU KNOW ?
తెలంగాణలో లోటు వర్షపాతమే
ఇటీవల తెలంగాణవ్యాప్తంగా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసినా ఇంకా లోటు వర్షపాతమే కొనసాగుతోంది. ఇప్పటివరకు సగటు వర్షపాతం 347 మిల్లిమీటర్ ఉండాల్సింది... కానీ 338.2 మి.మీ నమోదయ్యింది. అంటే 3 శాతం లోటు వర్షపాతం కొనసాగుతోంది.
25
మరికొన్ని రోజులు వర్షాలు లేనట్లే..
ఆగస్ట్ 5 లేదా 6 నుండి మెళ్లిగా వర్షాలు మొదలవుతాయని వాతావరణ సమాచారాన్ని అందించే తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ లో ప్రకటించారు. తెలంగాణలో ఆగస్ట్ 5 లేదా 6 నుండి మెళ్లిగా వర్షాలు ప్రారంభం అవుతాయని... రానురాను ఇవి పుంజుకుని భారీ వర్షాలుగా మారతాయని అంచనా వేస్తున్నారు. ఆగస్ట్ 7 లేదా 8 నుండి తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
35
అరేబియా సముద్రంలో తుఫాను
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ విభాగం చెబుతోంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారిందని... ఇది మరింత బలపడి వాయుగుండంగా, తుఫానుగా మారనుందని వెల్లడించారు. ఇందుకు రెండుమూడు రోజుల సమయం పడుతుందని... అప్పటివరకు వర్షాలు కురిసే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఈ తుఫాను ప్రభావంతో రెండుమూడు రోజులతర్వాత తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్ళీ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.
తెలంగాణలో నేడు (శుక్రవారం, ఆగస్ట్ 1) అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే ఉదయం నుండి సాయంత్రంవరకు పొడివాతావరణం ఉంటుందని... తర్వాత కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో స్థిరమైన ఉపరితల గాలులు (30-40 కి.మీ వేగంతో) వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగస్ట్ 5 వరకు ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని అంచనా వేశారు.
55
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
ఇప్పటికే వర్షాకాలంలో రెండు నెలలు ముగిశాయి... ఇక మిగిలింది రెండునెలలే. వర్షాకాలం ఫస్ట్ హాఫ్ లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేవు... సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందోనని తెలుగు ప్రజలు ఆందోళన నెలకొంది. వారికి ఊరటనిచ్చేలా భారత వాతావరణ విభాగం (IMD) గుడ్ న్యూస్ తెలిపింది. ఆగస్ట్, సెప్టెంబర్ లో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని... ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండి వెల్లడించింది. ఆగస్ట్ సెకండ్ వీక్ నుండి వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.