TASK: తెలంగాణలో విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగ నైపుణ్యాలను నేర్పించనున్నారు.
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK), డెల్ టెక్నాలజీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ‘ఉడాన్’ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మొత్తం 5,500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. మూడు నెలల వ్యవధిలో శిక్షణ పూర్తి చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
25
AI నుంచి క్లౌడ్ వరకు ఆధునిక టెక్నాలజీపై ట్రైనింగ్
ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న విభాగాలను శిక్షణలో చేర్చనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిజిటల్ స్కిల్స్ వంటి అంశాల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. కేవలం సర్టిఫికెట్ పొందడమే కాకుండా ఉద్యోగాల్లో ఉపయోగపడే ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.
35
IIT ఢిల్లీ కరిక్యులమ్‌తో ప్రత్యేక శిక్షణ
‘ఉడాన్’లో భాగంగా విద్యార్థులకు అందించే శిక్షణకు IIT ఢిల్లీ రూపొందించిన కరిక్యులమ్‌ను ఉపయోగించనున్నారు. దీనివల్ల పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ అందించే అవకాశం ఉంటుంది. డెల్ టెక్నాలజీస్ ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందించనుంది. విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న కోర్సులతో పాటు భవిష్యత్‌లో అవసరమయ్యే టెక్నాలజీ నైపుణ్యాలను కూడా నేర్చుకునేలా శిక్షణ విధానాన్ని రూపొందించారు.
విద్యార్థులను కేవలం ఉద్యోగాలకు మాత్రమే సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం కాదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శిక్షణ పూర్తయ్యాక అప్రెంటిస్‌షిప్ అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు వెళ్లేందుకు కూడా అవసరమైన నైపుణ్యాలను పెంచనున్నారు. విద్య నుంచి స్కిల్లింగ్, అక్కడి నుంచి ఉద్యోగం లేదా స్వయం ఉపాధి దిశగా విద్యార్థులను తీసుకెళ్లే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు మంత్రి వివరించారు.
55
ట్రైనింగ్ నుంచి ఎంప్లాయ్‌మెంట్ వరకు ఎకోసిస్టమ్
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి TASK–Dell భాగస్వామ్యం ఉపయోగపడుతుందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శిక్షణ పొందిన యువతకు పరిశ్రమలో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పిస్తూ ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలను పెంచడం ద్వారా ట్రైనింగ్ నుంచి ఎంప్లాయ్‌మెంట్ వరకు ఒక సమగ్ర వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువతకు ఆధునిక టెక్నాలజీపై శిక్షణ అందించడం ద్వారా భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు వారిని మరింత సన్నద్ధం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.