హైద‌రాబాద్‌లోని సుచిత్ర స‌ర్కిల్‌కు ఆ పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా.?

Published : Aug 07, 2026, 08:18 PM IST

Suchitra Junction: హైదరాబాద్‌లో రద్దీగా ఉండే కూడళ్లలో సుచిత్ర జంక్షన్ ఒకటి. కూకట్‌పల్లి, బోయిన్‌పల్లి, కొంపల్లి, మేడ్చల్, బాలానగర్, జీడిమెట్ల వైపు వెళ్లే వారికి ఇది కీలక మార్గం. అయితే "సుచిత్ర" అనే పేరు వెన‌కాలు ఎంతో చ‌రిత్ర ఉంద‌ని మీకు తెలుసా.?

PREV
14
సుచిత్ర ఎలక్ట్రానిక్స్‌తో మొదలైన గుర్తింపు

1981లో ఈ ప్రాంతంలో సుచిత్ర ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పేరుతో ఒక భారీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారీ సంస్థ ప్రారంభమైంది. ఆ రోజుల్లో ఈ ప్రాంతానికి సరైన బస్సు సౌకర్యం కూడా లేకపోయినా, ఈ కంపెనీలో 1,500 మందికి పైగా ఉద్యోగులు పనిచేసేవారు. ఉద్యోగుల రాకపోకలతో ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వచ్చింది. ప్రజలు "సుచిత్ర కంపెనీ దగ్గర" అని చెప్పుకుంటూ వచ్చారు. క్రమంగా అదే పేరు "సుచిత్ర జంక్షన్", "సుచిత్ర సెంటర్"గా స్థిరపడిపోయింది. 2000 ప్రాంతంలో కంపెనీ కార్యకలాపాలు ముగిసినా, ఆ పేరు మాత్రం ఎప్పటికీ చెరగలేదు. ప్రస్తుతం అదే ప్రాంగణంలో సుచిత్ర అకాడమీ ఏర్పాటు కావడంతో విద్యా రంగంలో కూడా ఆ ప్రాంతం తన ప్రత్యేకతను కొనసాగిస్తోంది.

24
శివారు ప్రాంతం నుంచి హైదరాబాద్‌లో కీలక కేంద్రంగా

ఒకప్పుడు నగరానికి దూరంగా ఉన్న ఈ ప్రాంతం, నేడు హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ఐటీ విస్తరణ, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, మెరుగైన రహదారులు రావడంతో సుచిత్ర చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. ప్రస్తుతం బీహెచ్‌ఈఎల్ అవేమాక్స్, బౌద్ధానగర్, ప్రాగా టూల్స్ కాలనీ, సుభాష్ నగర్, రాఘవేంద్ర కాలనీ, గాయత్రీ నగర్, బ్యాంక్ కాలనీ, ఎంఎన్ రెడ్డి నగర్, భాగ్యలక్ష్మి కాలనీ, స్ప్రింగ్ ఫీల్డ్స్, శ్రీ నిలయ ఎన్‌క్లేవ్ వంటి అనేక కాలనీలు అభివృద్ధి చెందాయి. దీంతో సుచిత్ర కేవలం జంక్షన్ మాత్రమే కాకుండా వేలాది కుటుంబాలు నివసించే ప్రధాన నివాస ప్రాంతంగా మారింది.

34
షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, విద్యాసంస్థలతో మారిన రూపు

ఇప్పటి సుచిత్ర ప్రాంతాన్ని చూస్తే ఒకప్పుడు ఇది శివారని నమ్మడం కూడా కష్టమే. ప్రముఖ షాపింగ్ మాల్స్, బ్రాండెడ్ షోరూమ్స్, సూపర్ మార్కెట్లు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు వరుసగా ఏర్పడ్డాయి. KLM షాపింగ్ మాల్, RS బ్రదర్స్, రిలయన్స్ డిజిటల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, చెన్నై షాపింగ్ మాల్, పై ఇంటర్నేషనల్, TNR నార్త్ సిటీ మాల్ వంటి వాణిజ్య సంస్థలు ఈ ప్రాంతాన్ని షాపింగ్ డెస్టినేషన్‌గా మార్చాయి. అంతేకాదు KFC, Pizza Hut, McDonald's, Subway వంటి అంతర్జాతీయ ఫుడ్ చైన్‌లు కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నాయి. దీంతో కుటుంబాలతో కలిసి వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

44
ప్రైవేట్ కాలేజీలతో 'హార్ట్ ఆఫ్ ది సిటీ'గా సుచిత్ర

గత కొన్నేళ్లలో సుచిత్ర చుట్టుప‌క్క‌ల‌ ప్రాంతంలో అనేక ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఏర్పడ్డాయి. విద్య కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు ప్రతిరోజూ ఇక్కడికి వస్తున్నారు. విద్యాసంస్థలు, వ్యాపార కేంద్రాలు, నివాస కాలనీలు, వైద్య సౌకర్యాలు ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండటంతో సుచిత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. అలాగే ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చి ఇక్క‌డ విద్య‌న‌భ్యసించే వారు కూడా సుచిత్ర ద‌గ్గ‌ర ప్రైవేట్ హాస్ట‌ళ్ల‌లో స్టే చేస్తున్నారు. బోయిన్‌పల్లి–మేడ్చల్ ప్రధాన రహదారిపై ఉండటం వల్ల రవాణా పరంగా కూడా ఈ ప్రాంతం కీలక కేంద్రంగా మారింది. నేడు హైదరాబాద్ ఉత్తర భాగంలో అత్యంత రద్దీగా ఉండే జంక్షన్‌లలో సుచిత్ర ఒకటిగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు ఓ పరిశ్రమకు చిరునామాగా నిలిచిన సుచిత్ర... నేడు విద్య, వ్యాపారం, నివాసం, షాపింగ్, వైద్య సేవలు అన్నీ ఒకే చోట లభించే ఆధునిక నగర కేంద్రంగా ఎదిగింది. కంపెనీ మూతపడినా, దాని పేరు మాత్రం హైదరాబాద్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories