Published : May 08, 2026, 07:43 PM ISTUpdated : May 08, 2026, 07:51 PM IST
Amaravati to Hyderabad Bullet Train : సౌత్ ఇండియాలో హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ నెట్‌వర్క్ కు రంగం సిద్ధమవుతోంది. దీని ద్వారా అమరావతి, హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య ప్రయాణ సమయం కొన్ని గంటల నుంచి నిమిషాల్లోకి తగ్గనుంది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్.. అన్ని సిటీలు ఒకే గంటలో! బుల్లెట్ ట్రైన్ రూట్లివే!
సౌత్ ఇండియా రవాణా వ్యవస్థ రూపురేఖలను మార్చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడమే కాకుండా, ఆర్థికంగా కూడా ఈ ప్రాంతాన్ని బలోపేతం చేసేలా 'హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్' నెట్‌వర్క్‌ను తీసుకురాబోతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగిన గూగుల్ క్లౌడ్ ఇండియా AI హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఈ ప్రతిష్ఠాత్మక ప్రణాళికను వివరించారు.
26
అమరావతి టు హైదరాబాద్.. కేవలం 70 నిమిషాల ప్రయాణం
కేంద్ర మంత్రి చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ నెట్‌వర్క్ అమరావతిని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే, ముంబై నగరాలతో అనుసంధానిస్తుంది. దీనివల్ల అమరావతి నుంచి హైదరాబాద్‌కు కేవలం 70 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ ప్రాజెక్టును దక్షిణ భారతదేశానికి ఒక 'హై-స్పీడ్ డైమండ్' లాంటిదని ఆయన అభివర్ణించారు.
ఈ బుల్లెట్ రైలు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడం కోసమే కాదు, ఒక ఆర్థిక మండలిని సృష్టించడం కోసం ఉద్దేశించినది. అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ మోడల్‌ను ఇక్కడ కూడా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ముంబై, సూరత్, వడోదర వంటి నగరాలు ఎలాగైతే ఒకే ఆర్థిక జోన్‌గా మారుతున్నాయో, అలాగే దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించడం ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
56
జూన్ 1 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్
చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పై మంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త జోన్ జూన్ 1న అధికారికంగా నోటిఫై చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగమైన ఈ జోన్ ఏర్పాటు ద్వారా రైల్వే అడ్మినిస్ట్రేషన్ మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అలాగే కోల్‌కతా-చెన్నై డబుల్ లైన్ నెట్‌వర్క్‌ను నాలుగు లైన్లుగా విస్తరిస్తామని, దీనివల్ల అదనంగా 500 రైళ్లను నడిపే అవకాశం ఉంటుందని చెప్పారు.
66
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే పెట్టుబడుల జోరు
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్‌లో కేవలం రూ. 886 కోట్లు మాత్రమే కేటాయించేవారని, కానీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రూ. 10,134 కోట్లు కేటాయించామని మంత్రి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ. 1,06,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని 74 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు.