Beer Sales: తెలంగాణలో ఏప్రిల్ నెలలో ఎవరూ ఊహించని స్థాయిలో బీర్ అమ్మకాలు జరిగాయి. ఐపీఎల్ మ్యాచులు కూడా జరుగుతుండడం బీరు మార్కెట్ కు మరింత బూస్ట్ ఇచ్చినట్టు అయ్యాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఎన్ని బీరు బాటిళ్ల అమ్మకం జరిగిందో తెలుసుకోండి.
మండే ఎండల్లో చల్ల చల్లని బీరు తాగేందుకు యువత ఎంతో ఇష్టపడతారు. దానికి తోడు ఐపీఎల్ మ్యాచ్లు కూడా తోడయ్యాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగే మ్యాచులను ఫ్రెండ్స్ తో కలిసి చూస్తూ ఓ పక్క బీరు కొడుతూ ఉంటే ఆ కిక్కే వేరు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి నగరాల్లో బీరు షాపులు భారీ రద్దీ ఉంటుంది. ఏప్రిల్ నెలలో విపరీతంగా బీర్ అమ్మకాలు పెరిగినట్టు లిక్కర్ వ్యాపారులు చెబుతున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ఎంతో మంది బీరు తాగేందుకు ఇష్టపడ్డారని వారు వివరించారు.
23
కళ్లు చెదిరే లెక్కలు
ఎక్సైజ్ శాఖ చెబుతున్న ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నెలలో 41.39 లక్షల కేసులు బీర్లు అమ్ముడయ్యాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఆ రికార్డు బద్దలైపోయింది. ఏకంగా ఏప్రిల్ లో 50. 05 లక్షల కేసుల బీరు బాటిల్స్ అమ్ముడవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి ఇది రికార్డు అనే చెప్పుకోవాలి. మార్చి నెలలో కూడా అధికంగానే బీరు అమ్మకాలు సాగాయి. గతేడాది మార్చిలో 39 లక్షల కేసులు మాత్రమే అమ్మడవుగా ఈసారి ఏకంగా 50 లక్షల కేసులు అమ్ముడు అయ్యాయి. అంటే యువత ఎంతగా బీర్ ను తాగుతున్నారో అర్థం చేసుకోండి.
33
డిమాండ్ ఎక్కువ..స్టాక్ తక్కువ
రోజుకు మూడు లక్షల కేసులు తెలంగాణలో అవసరం పడుతుండగా కంపెనీలు మాత్రం కేవలం రెండు లక్షల కేసుల బీర్లు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నాయి. దీంతో లిక్కర్ షాపు యజమానులు స్టాక్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎండలు ఇలాగే పెరిగితే మే జూన్లలో అమ్మకాలు 75 లక్షల కేసులను దాటేయచ్చని అంచనా