బస్సు ద్వారా: సికింద్రాబాద్ లేదా మెహిదీపట్నం నుంచి దుండిగల్, గండిమైసమ్మ వైపు వెళ్లే సిటీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. లేదా మెదక్ వెళ్లే బస్సులు ఎక్కినా మధ్యలో దిగొచ్చు.
సొంత వాహనం: బయట నుంచి వచ్చేవారు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఎగ్జిట్ నంబర్ 5 (సుల్తాన్‌పూర్/దుండిగల్) ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
సమయాలు: ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5:00 నుండి రాత్రి 8:00 వరకు ఆలయం తెరిచి ఉంటుంది.
ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన ఈ పాతాళ హనుమంతుడి ఆలయం ప్రతి ఒక్కరూ సందర్శించదగ్గ అద్భుతమైన క్షేత్రం అనడంలో సందేహం లేదు.