తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారమిది. వచ్చే నెల సెప్టెంబర్ లో విద్యాసంస్థలకు ఏకంగా 14 రోజుల సెలవులు వస్తున్నాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఏరోజు ఎందుకు సెలవో, ఇంకా ఎందుకు పెరగవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
School Holidays : వేసవి సెలవుల తర్వాత దాదాపు రెండునెలల పాటు విద్యార్థులు ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా అని ఎదురుచూడాల్సి వచ్చింది. జూన్ లో స్కూళ్ళు ప్రారంభమవగా జులై ముగింపువరకు కంటిన్యూగా స్కూళ్ళు నడిచాయి... ఆదివారాలు, మధ్యలో ఒకట్రెండు సెలవులు మాత్రమే వచ్చాయి. కానీ ఆగస్ట్ లో అలాకాదు... పండగలు, పర్వదినాలు, ప్రత్యేక రోజులు, భారీ వర్షాల కారణంగా వరుస సెలవులు వచ్చాయి. అయితే ఈ సెలవుల పరంపర వచ్చే నెల సెప్టెంబర్ లో కూడా కొనసాగనుంది... ఇంకా చెప్పాలంటే ఆగస్ట్ ను మించి సెలవులు రానున్నాయి.
సెప్టెంబర్ లో దాదాపు సగంరోజులు సెలవులే ఉండనున్నాయి... ఫస్ట్ వీక్ లో ప్రారంభమయ్యే సెలవులు లాస్ట్ వీక్ వరకు కొనసాగనున్నాయి. 30 రోజుల్లో కేవలం 16 రోజులే స్కూళ్ళు నడిచేది... మిగతా 14 రోజులు సెలవులే. ఇలా సెప్టెంబర్ లో ఏరోజు ఎందుకు సెలవుందో ఇక్కడ తెలుసుకుందాం.
26
సెప్టెంబర్ 5న సెలవు
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ముస్లింల జనాభా ఎక్కువగానే ఉంటుంది. దీంతో వీరు జరుపుకునే పండగలకు ప్రభుత్వాలు అధికారిక సెలవులు ఇస్తుంటాయి. ఇలా సెప్టెంబర్ 5న శుక్రవారం ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే మిలాదున్ నబీ పండగ సందర్భంగా ఇరురాష్ట్రాలు ఇప్పటికే సెలవు ప్రకటించాయి. కేవలం స్కూళ్లకే కాదు ఆఫీసులకు కూడా ఈరోజు సెలవే... వీకెండ్ లో ఈ హాలిడే వస్తుండటం స్టూడెంట్సే కాదు ఉద్యోగాలు చేసే పేరెంట్స్ ఆనందించే విషయం.
ఇక సాప్ట్వేర్, కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు శనివారం సెలవే. హైదరాబాద్, విశాఖపట్నం వంటి ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే నగరాల్లో కొన్ని విద్యాసంస్థలు ప్రతి శనివారం సెలవు ఇస్తుంటాయి. ఐటీ ఉద్యోగుల పిల్లలు పేరెంట్స్ తో గడిపేందుకు వీలుగా ఈ సెలవు ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్కూళ్లలో చదివే విద్యార్థులకు వరుసగా మూడ్రోజులు (ఆదివారంతో కలిపి) సెలవు వస్తుంది.
36
సెప్టెంబర్ 7న సెలవే
సెప్టెంబర్ 7 ఆదివారం... కాబట్టి ఆరోజు ఎలాగూ విద్యాసంస్థలకు సాధారణ సెలవే. ఇక కొన్ని అత్యవసర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు తప్ప మిగతా అందరికీ ఆదివాకం సెలవు ఉంటుంది. ఇలా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో కొందరికి వరుసగా మూడ్రోజులు, మరికొందరికి రెండురోజులు సెలవులు వస్తున్నాయి.
సెప్టెంబర్ 13న రెండో శనివారం... కాబట్టి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్ధలన్నింటికి ఆరోజు సెలవే. ఇక సెప్టెంబర్ 14 ఆదివారం కాబట్టి సాధారణ సెలవు ఉంటుంది. ఇలా సెప్టెంబర్ సెకండ్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి.
56
సెప్టెంబర్ 21 నుండి దసరా సెలవులే
సెప్టెంబర్ చివరి పదిరోజులు దసరా సెలవులతో పూర్తవుతుంది. తెలంగాణలో అయితే సెప్టెంబర్ 21 నుండి దసరా సెలవులు ప్రారంభం అవుతున్నాయి... కాబట్టి ఈ నెలలో చివరి పదిరోజులు సెలవులే. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం సెప్టెంబర్ 24 నుండి దసరా సెలవులు ఇచ్చారు.. అంటే తెలంగాణ కంటే ఏపీ విద్యార్థులకు దసరా సెలవులు కాస్త తక్కువగా ఉంటాయన్నమాట.
ఇలా సెప్టెంబర్ లో మిలాదున్ నబీతో ప్రారంభమయ్యే సెలవులు దసరా వరకు కొనసాగుతాయి. మొత్తంగా చూసుకుంటే ఈ నెలలో ఏకంగా 14 రోజులు సెలవులు వస్తున్నాయి... భారీ వర్షాలు, బంద్ లు ఏమైనా ఉంటే ఈ సెలవుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలుంటాయి.
66
తెలుగు ఉద్యోగులకు సెలవులు
విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా సెప్టెంబర్ లో వరుస సెలవులు వస్తున్నాయి. తెలంగాణలో సెప్టెంబర్ 5 మిలాదున్ నబీ, సెప్టెంబర్ 21 బతుకమ్మ మొదటిరోజు సందర్భంగా సాధారణ సెలవులు... సెప్టెంబర్ 30న దుర్గాష్టమి సందర్భంగా ఉద్యోగులకు ఐచ్చిక సెలవు ఉంది. ఏపీ విషయానికి వస్తే మిలాదున్ నబీ, దుర్గాష్టమి సెలవు వర్తిస్తుంది. సెప్టెంబర్ 21న తెలంగాణలో బతుకమ్మ, ఏపీలో మహాలయ అమావాస్యకు ఆప్షనల్ హాలిడే ఉంది... కానీ ఆరోజు ఆదివారం కాబట్టి సాధారణ సెలవు ఉంటుంది.