School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే

Published : Aug 03, 2026, 02:08 PM IST

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే సమాచారం. ఈ వారంలో ఇంకా నాల్రోజులే స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు నడిచేది… తర్వాత వరుసగా రెండుమూడు రోజులు సెలవులు వస్తున్నాయి.

PREV
15
తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు ఈవారం సెలవులే సెలవులు

School Holidays : సెలవులు... ఈ పేరు వింటేచాలు విద్యార్థులే కాదు ఉద్యోగులు కూడా ఎగిరి గంతేస్తారు. సాధారణంగా ప్రతి ఆదివారం విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది, దీనికోసమే విద్యార్థులు ఎదురుచూస్తుంటారు... అలాంటిది వారంలో ఇంకేదైనా పండగ లేదా ప్రత్యేక సందర్భంలో సెలవు వచ్చిందో సంతోషిస్తారు. అదే ఈ ప్రత్యేక సెలవు వీకెండ్ తో కలిసివచ్చిందో వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇలాంటి సెలవులే ఈ వీకెండ్ లో తెలుగు విద్యార్థులకు రాబోతున్నాయి.

కేవలం విద్యాసంస్థలకే కాదు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు కూడా ఈ వీకెండ్ వరుస సెలవులు వస్తున్నాయి. అంటే ఈ వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారనుంది. తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు ఏరోజు, ఎందుకు సెలవు వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

25
వీకెండ్ కాదు లాంగ్ వీకెండ్

తెలుగు రాష్ట్రాలకు చెందిన స్కూల్ విద్యార్థులకే కాదు కాలేజీ యువత, ఉద్యోగులకు ఆగస్ట్ 8,9 (శని, ఆదివారం) రెండ్రోజులు సెలవే. అయితే తెలంగాణోళ్లకు మాత్రం ఇంకో సెలవు ఎక్స్ట్రాగా వస్తోంది... అంటే ఆగస్ట్ 10 (సోమవారం) కూడా హాలిడేనే. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ లో రెండ్రోజులు, తెలంగాణలో మూడ్రోజులు సెలవులున్నాయి... వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారనుంది.

35
ఏరోజు, ఎందుకు సెలవు?

ప్రతి నెలలో రెండో శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలకు సెలవు ఉంటుంది. ఈవారం వచ్చేది రెండో శనివారమే (ఆగస్ట్ 8)... కాబట్టి తెలంగాణ, ఏపీ విద్యాసంస్థలకు సెలవు ఉంది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఎంప్లాయిస్ కు కూడా ఈ శనివారం సెలవే. సాప్ట్ వేర్, కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రతి శనివారం సెలవు ఉంటుంది... అంటే ఈ శనివారం కొందరు ప్రైవేట్ ఉద్యోగులకు కూడా సెలవు ఉంటుందన్నమాట.

ఆగస్ట్ 9 ఆదివారమే కాబట్టి ఎలాగూ సాధారణ సెలవు ఉంటుంది. అంటే ఈ శని, ఆదివారం తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులే. అయితే తెలంగాణ విద్యార్థులకు ఇంకో సెలవు అదనంగా వస్తోంది... వీరికి సోమవారం (ఆగస్ట్ 10) కూడా సెలవే. అంటే వరుసగా మూడ్రోజుల సెలవులు వస్తున్నాయి.

45
ఆగస్ట్ 10న తెలంగాణోళ్లకే స్పెషల్ హాలిడే... ఎందుకో తెలుసా?

తెలంగాణలో ఆషాడ మాసం వచ్చిందంటే చాలు బోనాలు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ నెలంతా బోనాల సందడి నెలకొంటుంది. నిన్న (ఆగస్ట్ 2) సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో బోనాలు వేడుకలు జరిగాయి... వచ్చే ఆదివారం హైదరాబాద్ మొత్తం బోనాలు జరుపుకుంటారు. ఓల్డ్ సిటీ లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయంతో పాటు నగరంలోని వివిధ అమ్మవారి అలయాల్లో బోనాల వేడుకలు జరుగుతాయి.

వచ్చే ఆదివారం (ఆగస్ట్ 9) హైదరాబాద్ లోనే కాదు తెలంగాణవ్యాప్తంగా బోనాల వేడుకలు జరుపుకుంటారు. ఆరోజు ఎలాగూ సాధారణ సెలవే... కాబట్టి తర్వాతరోజు ప్రత్యేక సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇలా వచ్చే సోమవారం (ఆగస్ట్ 10) కూడా తెలంగాణ స్కూళ్లు, కాలేజీలకే కాదు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు కూడా సెలవుంది. కాబట్టి ఈ వీకెండ్ ఏపీలో రెండ్రోజులు సెలవుంటే తెలంగాణలో మాత్రం మూడ్రోజుల సెలవులున్నాయి. అంటే ఈవారంలో ఇంకా నాల్రోజులే స్కూళ్లు, ఆఫీసులు నడిచేది... తర్వాత వరుసగా రెండుమూడు రోజులు సెలవులే.

55
ఈ ఆగస్ట్ లో రాబోయే సెలవులు ఇవే..

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉద్యోగులకు ఈ ఆగస్ట్ లో భారీ సెలవులున్నాయి. ఇందులో కొన్ని అధికారిక సెలవులుంటే ఇంకొన్ని ఐచ్చిక సెలవులున్నాయి. ఇక ఆదివారాలు, రెండో శనివారం కలిపితే ఈ సెలవులు సంఖ్య మరింత పెరుగుతోంది. ఏరోజు, ఎందుకు సెలవుందో చూద్దాం.

ఆగస్ట్ 4 (మంగళవారం) - అర్బాయిన్ (ఐచ్చిక సెలవు)

ఆగస్ట్ 8 (శనివారం) - రెండో శనివారం సెలవు

ఆగస్ట్ 9 - ఆదివారం సెలవు

ఆగస్ట్ 10 (సోమవారం) - బోనాల సెలవు (తెలంగాణలో మాత్రమే)

ఆగస్ట్ 15 (శనివారం) - స్వాతంత్య్ర దినోత్సవం సెలవు, పార్సీ న్యూఇయర్ సందర్భంగా ఐచ్చిక సెలవు

ఆగస్ట్ 16 - ఆదివారం సెలవు

ఆగస్ట్ 21 (శుక్రవారం) - వరలక్ష్మి వ్రతం (ఐచ్చిక సెలవు)

ఆగస్ట్ 23 - ఆదివారం సెలవు

ఆగస్ట్ 26 (బుధవారం) - ఈద్ మిలాదున్ నబి

ఆగస్ట్ 28 (శుక్రవారం) - శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి

ఆగస్ట్ 30 - ఆదివారం సెలవు

గమనిక : 

ఐచ్చిక సెలవు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. కావాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తు అనుమతితో ఈరోజు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. విద్యార్థులకు, ప్రైవేట్ ఉద్యోగులకు ఇది వర్తించదు.

Read more Photos on
click me!

Recommended Stories