Flood Alert : తెలంగాణకు పొంచివున్న వరద ముప్పు... ఆస్తి, ప్రాణనష్టం తప్పదా?

Published : Aug 03, 2026, 11:39 AM IST

భారతదేశంలో ఇకపై భారీ వర్షాలు ఉండవని ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతోంది… తెలంగాణలో మాత్రం కుండపోత వర్షాలతో వరదలు సంభవిస్తాయని భవిష్యవాణి చెబుతోంది. మరి ఏది నిజం అవుతుంది?

PREV
15
తెలంగాణలో భారీ వర్షాలు

Flood Alert : ఎల్ నినో ప్రభావంతో ఈ వర్షాకాలం ఆలస్యంగా మొదలయ్యింది... ఇప్పుడిప్పుడే వర్షాలు జోరందుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో తెలుగు ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రకటనలు వెలువడుతున్నాయి. ఎల్ నినో మరింత తీవ్రరూపం దాల్చి సూపర్ ఎల్ నినో గా మారుతుందని.. ఇది ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరిస్తోంది. ఈ సూపర్ ఎల్ నినో దేశంలో వర్షాలు కురవకుండా అడ్డుకుంటుందని డబ్ల్యుఎంవో చెబుతోంది.

అయితే సికింద్రాబాద్ బోనాల వేడుకల్లో భాగంగా నిర్వహించిన రంగం (భవిష్యవాణి) లో మాతంగి స్వర్ణలత వర్షాలపై సంచలన విషయాలు తెలిపారు. రాబోయే రోజుల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసి వరదలు సంభవిస్తాయని హెచ్చరించారు. ప్రాణ, ఆస్తినష్టం జరిగే స్థాయిలో వర్షాలు, వరదలు ఉంటాయని భవిష్యవాణి వినిపించింది. ఇలా ప్రపంచ వాతావరణ సంస్థ సూపర్ ఎల్ నినో తో వర్షాలు ఉండవంటే భవిష్యవాణి మాత్రం కుండపోత వర్షాలుంటాయని అంటోంది. ఇందులో ఏది నిజం అవుతుందోనని తెలుగు ప్రజలు కన్ప్యూజ్ అవుతున్నారు.

25
తెలంగాణకు వరద ముప్పు

బోనాలు వేడుకల్లో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 3, సోమవారం) సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో రంగం నిర్వహించారు. ఈ క్రమంలో మాతంగి స్వర్ణలత రాబోయే రోజుల్లో వర్షాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిపారు. ఈ సంవత్సరం తెలంగాణలో ప్రకృతి విపత్తులు తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి... రాబోయే రోజుల్లోనూ ఇవి కొనసాగుతాయని తెలిపారు. భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసి వరదలు సంభవిస్తాయని స్వర్ణలత హెచ్చరించారు.

తెలంగాణలో గత వారం పదిరోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి... జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ భవిష్యవాణిలో చెప్పడం ప్రజలను కంగారుపెడుతోంది. ప్రజల ప్రాణాలు కూడా బలయ్యే స్థాయిలో వరదలు ఉంటాయని... ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం ఆందోళన కలిగించే అంశం. వరదల కారణంగా అనేక ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయంటూ మాతంగా స్వర్ణలత హెచ్చరించారు.

35
తెలంగాణలో అగ్ని ప్రమాదాలు

ఈ ఏడాది తెలంగాణ ప్రకృతి ప్రకోపానికి గురికాక తప్పదని మహంకాళి ఆలయంలో నిర్వహించిన భవిష్యవాణి చెబుతోంది. ఓవైపు భారీ వర్షాలతో వరదలు సంభవిస్తాయని, మరోవైపు భారీ అగ్నిప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. అంటే భారీ ఆస్తి, ప్రాణనష్టం ఉంటుందని ముందుగానే హెచ్చరిస్తోంది. ఈ ఏడాది ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాతంగి స్వర్ణలత ఆ అమ్మవారి మాటలుగా తెలియజేశారు.

అయితే ఏ ఆపద వచ్చినా తన భక్తులను కాపాడుకుంటానని మహంకాళి అమ్మవారి మాటలు మాతంగి స్వర్ణలత నోట పలికాయి. తన మాటలను గౌరవించి, ధర్మాన్ని పాటిస్తూ, భక్తితో నడుచుకోవాలని సూచించారు. ఇలాంటి భక్తులకే తన అనుగ్రహం ఉంటుందని తెలిపారు.

ప్రజల్లో అహంకారం ఎక్కువవుతోంది... తగ్గించుకుంటే మంచిదని రంగంలో స్వర్ణలత సూచించింది. ఈ ఏడాది నన్ను బాధపెడుతున్నారు.. కంటతడి పెట్టిస్తున్నారని అన్నారు. ఈసారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తే కోరిన కోరికలు తీరుస్తానని తెలిపారు. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ చేయకపోతే ప్రాణనష్టం తప్పదని మాతంగి స్వర్ణలత హెచ్చరించారు.

45
ప్రపంచ వాతావరణ సంస్థ ఏం చెబుతోంది?

సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఈ వర్షాకాలం సెకండాఫ్ లో లోటు వర్షపాతమే ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా భారతదేశంలో ఆగస్ట్, సెప్టెంబర్ లోనే అత్యధిక వర్షాలు కురుస్తాయి... వీటిని ఈసారి ఎల్ నినో అడ్డుకుంటుందట. ఈ నెల (ఆగస్ట్) సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (IMD) కూడా ప్రకటించింది.

పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతూ సూపర్ ఎల్ నినో ఏర్పడుతున్నట్లు డబ్ల్యుఎంవో హెచ్చరిస్తోంది. దీంతో ఆగస్ట్ నుండి అక్టోబర్ వరకు భారతదేశంలో భారీ వర్షాలు ఉండవని... లోటు వర్షపాతం తప్పదని తెలిపింది. మరికొన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది... కరవు పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది.

55
నేడు తెలంగాణలో భారీ వర్షాలు

ఇవాళ (ఆగస్ట్ 3, సోమవారం) తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖలు తెలిపారు. ద్రోణి ప్రభావంతో రాబోయే మూడ్రోజులు తెలంగాణలో వర్షాలు కొనసాగుతాయట... దీంతో భారీ వర్షసూచనలున్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. కేవలం వర్షాలే కాదు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... వర్ష సమయంలో చెట్లకింద ఉండరాదని సూచిస్తోంది.

ఇక తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. నేడు సౌత్, నార్త్, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్నం లేదా సాయంత్రం, రాత్రి సమయాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లో కూడా సాయంత్రం, రాత్రి సమయంలో వర్షాలుంటాయని ప్రకటించారు తెలంగాణ వెదర్ మ్యాన్.

Read more Photos on
click me!

Recommended Stories