Medaram Jathara Holidays : తెలంగాణలో ప్రస్తుతం మేడారం జాతర జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. దీంతో ఈ వీకెండ్ ఎన్నిరోజులు సెలవులు వస్తున్నాయో తెలుసా..?
School Holidays : భారతదేశంలో కాదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం గుర్తింపుపొందింది. దేశ నలుమూలల నుండే కాదు విదేశాల నుండి కూడా ఈ జాతరకు భక్తులు వస్తుంటారు... వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలోనే ఈసారి జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు కుటుంబసమేతంగా వెళ్ళేందుకు తెలుగు ప్రజలు సిద్దమవుతున్నారు. ఇందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు, ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటించింది.
25
జనవరి 30న సెలవు...
న్యూఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే... ఇలా జనవరిలో వరుస సెలవులు వచ్చాయి. ఇప్పుడు మేడారం జాతర సందర్భంగా మరో సెలవు వస్తోంది. ఇప్పటికే మేడారంలో మహాజాతర ప్రారంభమయ్యింది... గిరిజనులు, సామాన్య ప్రజలు తండోపతండాలుగా తరలివెళుతున్నారు. తెలుగు రాష్ట్రాల దారులన్నీ మేడారంవైపే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమ్మక్క, సారలమ్మలు గద్దెలపై కొలువయ్యే జనవరి 30 (శుక్రవారం) విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
సమ్మక్క, సారలమ్మ జాతర జరుగుతున్న ములుగు జిల్లాల్లో అధికారిక సెలవు ప్రకటించారు. కుటుంబసమేతంగా వనదేవతలను దర్శించుకునేందుకు వీలుగా ఈ జిల్లా ప్రజలందరికీ సెలవు ఇచ్చారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికి ఈ సెలవు వర్తింస్తుంది... అలాగే ఉద్యోగులందరికీ సెలవే. ఈ మేరకు ములుగు కలెక్టర్ పేరిట సెలవు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
35
వరుసగా మూడ్రోజులు సెలవులే...
మేడారం జాతర సెలవు జనవరి 30న అంటే శుక్రవారం వస్తోంది. ఇక జనవరి 31 శనివారం కాబట్టి కొంతమందికి సెలవు ఉంటుంది. కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రతి వీకెండ్ లో శని, ఆదివారం రెండ్రోజులు సెలవు ఉంటుంది. ఇక మల్టీ నేషనల్ కంపెనీలు, కార్పోరేట్ ఉద్యోగులకు కూడా వీకెండ్ రెండ్రోజులు సెలవే. కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రెండ్రోజులు సెలవు ఉంటుంది. ఇలా శనివారం సెలవు ఉండే విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా మూడ్రోజులు (జనవరి 30,31, ఫిబ్రవరి 1) సెలవులు కలిసివస్తున్నాయి.
తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన ఉత్సవం ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. కాబట్టి కేవలం ములుగు జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు ప్రకటించాలని పలు హిందుత్వ సంస్థలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జాతరలో ముఖ్యమైన రోజులు జనవరి 30, 31న సెలవు ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేస్తోంది.
ఇక ఇప్పటికే ఉపాధ్యాయ సంఘం పిఆర్టియూ (PRTU) కూడా మేడారం జాతరకు సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లేందుకు అనువుగా సెలవు డిమాండ్ చేసింది. కొన్ని విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాలు కూడా మేడారం జాతరకు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
55
మేడారం జాతరలో జనవరి 30 చాలా కీలకం...
జనవరి 28 (బుధవారం) మేడారంలో అసలైన మహా జాతర మొదలయ్యింది... మొదటిరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకున్నారు.
జనవరి 29(గురువారం) అంటే ఇవాళ సమ్మక్క కూడా గద్దెపై కొలువుదీరుతారు.
జనవరి 30 (శుక్రవారం) సమ్మక్క-సారలమ్మ ఇద్దరు దేవతలు గద్దెలపై కొలువై భక్తులకు దర్శనం ఇస్తారు. మేడారం జాతరలో ఇదే ప్రధానమైన రోజు.
జనవరి 31(శనివారం) సాయంత్రం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవుళ్లు తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం జాతర ముగుస్తుంది.